Page Loader
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన

వ్రాసిన వారు Stalin
Jan 31, 2023
03:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి విశాఖపట్నం కొత్త రాజధాని కానుందని సీఎం జగన్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో తాను విశాఖకు షిఫ్ట్ కాబోతున్నట్లు వెల్లడించారు. మార్చి 3, 4 తేదీల్లో కొత్త రాజధాని విశాఖలో పెట్టుబడుల సదస్సును ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. సదస్సుకు వ్యాపారవేత్తలు, పెట్టబడిదారులను ఆహ్వానించారు. 2014లో ఆంధ్రప్రదేశ్-తెలంగాణ విడిపోయాక ఏడాదిపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉంది. 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఆంధ్రా ప్రభుత్వం కృష్ణా నది ఒడ్డున ఉన్న విజయవాడ-గుంటూరు ప్రాంతంలోని అమరావతిని కొత్త రాజధానిగా రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. అనంతరం కొన్ని నిర్మాణాలు కూడా చేపపట్టారు. తాజాగా రాజధానిని అమరావతి నుంచి విశాఖకు మారున్నట్లు జగన్ ప్రకటించడం గమనార్హం.

వైఎస్ జగన్

ఉగాది లోపు విశాఖకు రాజధాని తరలింపు

త్వరలోనే విశాఖపట్నానికి రాజధాని తరలి వెళ్తుందని ఇప్పటికే చాలా సార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు మంత్రులు బోత్స సత్యనారాయణ, గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి చెప్పడంతో ఇక రాజధాని తరలింపు కార్యక్రమం ఉగాది లోపు ఉండొచ్చనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. 2019లో ఆంధ్రప్రేదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2020లో సీఎం జగన్ మూడు రాజధానుల అంశాన్ని ప్రతిపాదించారు. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజాధానిగా చేయాలని నిర్ణయించారు. హైకోర్టు ఆదేశాలతో మూడు రాజధానుల విషయంలో జగన్ ప్రభుత్వం మధ్యలో కొంత వెనక్కి తగ్గినా, సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తోంది. అందుకే మళ్లీ మూడు రాజధానుల నినాదాన్ని వైసీపీ ఎత్తుకుంది.