Page Loader
పవన్ భార్యలపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్ భార్యలపై సీఎం జగన్ ఆసక్తికర కామెంట్స్

పవన్ భార్యలపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Stalin
Dec 31, 2022
08:53 am

ఈ వార్తాకథనం ఏంటి

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ఒక పార్టీపై ఇంకో పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. వ్యక్తిగత విమర్శలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా పవన్ కల్యాణ్‌పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ హీట్‌ను పెంచేసాయి. శుక్రవారం నర్సీపట్నంలో జరిగిన బహిరంగ సభలో జగన్ ,పవన్ కల్యాణ్ భార్యలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవసరమొచ్చినప్పుడు పార్టీలతో స్నేహం చేస్తారని జగన్ విమర్శించారు. ఈ పార్టీ కాకపోతే.. ఇంకో పార్టీ, ఈ ప్రజలు కాకపోతే.. ఆ ప్రజలు అన్న చందంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ 'ఈ భార్య కాకపోతే.. ఇంకో భార్య' అన్న చందంగా ప్రవర్తిసున్నారన్నారు.

జగన్

'ఒక్క సీటు కూడా గెలవలేదు'

తాను చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాదిరిగా కాదనన్నారు సీఎం జగన్. తన రాష్ట్రం ఇదేనని, ఇక్కడే నివాసం ఉందన్నారు. అలాగే పవన్‌ను లక్ష్యంగా చేసుకోని మరో విమర్శ చేశారు జగన్. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి ఇన్నేళ్లయినా.. ఒక్క సీటు కూడా గెలవలేకపోయారన్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తే.. రెండు చోట్లా ప్రజలు ఓడించినట్లు పేర్కొన్నారు. పవన్ కల్యాణ్‌కు రాజకీయాల్లో దర్శకుడు, నిర్మాత చంద్రబాబే అన్నారు. చంద్రబాబు.. ఇటీవల ఖమ్మంలో భారీ సభను నిర్వహించారు. అది గ్రాండ్‌గా సక్సెస్ అయ్యింది. ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు.. ఈ రాష్ట్రం కాకపోతే.. ఇంకో రాష్ట్రం అన్న చందంగా వ్యవహరిస్తున్నారని జగన్ విమర్శించి ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.