Page Loader
ఉగాదికి ముహూర్తం: కొత్త రాజధాని వైజాగ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ షిఫ్ట్!
మార్చిలో కొత్త రాజధాని వైజాగ్‌కు షిఫ్ట్ కానున్న ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్

ఉగాదికి ముహూర్తం: కొత్త రాజధాని వైజాగ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ షిఫ్ట్!

వ్రాసిన వారు Stalin
Feb 07, 2023
06:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌కి విశాఖపట్నం కొత్త రాజధాని కానుందని ఇటీవల నిర్వహించిన ప్రపంచ పెట్టుబడుల సదస్సు సన్నాహక సమావేశంలో సీఎం జగన్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో తాను విశాఖకు షిఫ్ట్ కాబోతున్నట్లు వెల్లడించారు. అయితే సీఎం జగన్ వైజాగ్‌కు షిఫ్ట్ అయ్యేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఉగాది నాటికి వైజగ్ కార్యకలాపాలను ప్రారంభించాలని జగన్ భావిస్తన్నాట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో పెట్టుబడుల సదస్సును నిర్వహించి, తర్వాత జగన్ పూర్తి స్థాయిలో షిఫ్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల కేసు విచారణను ఈనెల 23వ తేదీన విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ తీర్పు వచ్చాక జగన్ తుది నిర్ణయం తీసుకుంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్

బీచ్ రోడ్డులో సీఎం అధికారిక నివాస భవనాన్ని ఖరారు చేసే అవకాశం

మార్చి మూడో వారంలో విశాఖపట్నంలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఏపీ సచివాలయ వర్గాల సమాచారం. మార్చి 22న ఉగాది కావడంతో ఆ పండుగ సందర్భంగా వైజాగ్‌కు షిఫ్ట్ కావాలనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రితో పాటు సీనియర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల ప్రభుత్వ కార్యాలయాలు, నివాసాలకు భవనాలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్ర రాజధాని తరలింపుపై జిల్లా అధికారులకు ఇంకా అధికారిక ఉత్తర్వులు రానప్పటికీ, అధికారులు ముందస్తుగా అన్నీ సిద్ధం చేసేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. నగరంలోని కీలక ప్రాంతమైన బీచ్ రోడ్డులో ముఖ్యమంత్రి అధికారిక నివాస భవనాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది.