ఆంధ్రప్రదేశ్: మూడు రాజధానుల అంశంపై ఈనెల 23న సుప్రీంకోర్టులో విచారణ
ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల కేసు విచారణను ఈనెల 23వ తేదీన విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. మూడు రాజధానుల అంశాన్నిఅత్యవసర ప్రాతిపదికన విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున వాదిస్తున్న న్యాయవాది నిరంజన్ రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. దీంతో 23న విచారిస్తామని జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్నతో కూడిన ధర్మానసం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతిని సమర్థిస్తూ ఏపీ హైకోర్టు మార్చి 3న ఇచ్చిన తీర్పుపై వైఎస్సార్‌సీపీ నేతృత్వంలోని ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్ 17న స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్‌ఎల్‌పీ) దాఖలు చేసిన విషయం తెలిసిందే.
న్యాయపరమైన అడ్డకుంటులు లేకుండా చూసుకోవాలనే ఆలోచనలో జగన్ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాజధానిని త్వరలో విశాఖకు మార్చనున్నట్లు సీఎం జగన్ ప్రకటించిన నేపథ్యంలో వీలైనంత త్వరగా న్యాయపరమైన అడ్డంకులు లేకుండా చూసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ఏపీ ప్రభుత్వం తరపఫున వాదిస్తున్న నాయవాది ఈ కేసును త్వరగా విచారించాలని ధర్మానసాన్ని అభ్యర్థించారు. 2020లో సీఎం జగన్ మూడు రాజధానుల అంశాన్ని ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రభుత్వానికి దాని రాజధానిని నిర్ణయించే శాసనపరమైన సామర్థ్యం లేదని ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది. అమరావతి నగరం, రాజధాని ప్రాంతాన్ని 6 నెలల్లోగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు గతేడాది నవంబర్‌లో స్టే విధించింది. 'కోర్టులు టౌన్ ప్లానర్, చీఫ్ ఇంజనీర్ కాలేవు' అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.