Colombia Plane Crash: కొలంబియా-వెనిజులా సరిహద్దు సమీపంలో కూలిన విమానం.. పార్లమెంట్ సభ్యుడు సహా 15 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
దక్షిణ అమెరికా దేశం కొలంబియాలో ఒక వాణిజ్య విమానం కూలిపోయింది. 15 మందితో కుకుటా నుంచి ఒకానాకు వెళ్తున్న వాణిజ్య బీచ్‌క్రాఫ్ట్-1900 విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో కొలంబియన్ పార్లమెంట్ సభ్యుడు సహా 15 మంది మృతి చెందారు. బుధవారం ఉదయం 13 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో కూడిన విమానం కుకుటా విమానాశ్రయం నుండి బయలుదేరింది. ల్యాండింగ్‌కి కొన్ని నిమిషాల ముందు,విమానం కాటాటుంబో ప్రాంతంలో అదృశ్యమైంది. అత్యవసర శోధన కార్యకలాపాల తరువాత,విమానం శిథిలాలు కనుగొన్నారు. ఈ ఘటన కొలంబియా-వెనిజులా సరిహద్దు సమీపంలో చోటుచేసుకుంది. కొలంబియన్ ఏరోస్పేస్ ఫోర్స్,సివిల్ ఏవియేషన్ అథారిటీలు ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించాయి. మృతుల కుటుంబాలకు,సంబంధిత వ్యక్తులకు సహాయం అందించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ కూడా ఏర్పాటు చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కొలంబియాలో కూలిన విమానం
JUST IN - Debris from a Colombian plane carrying 15 people, including a lawmaker, has been found; no survivors reported. pic.twitter.com/DX2YJFadYG
— Insider Paper (@TheInsiderPaper) January 28, 2026