తదుపరి వార్తా కథనం

YS Jagan: జగన్ తిరుమల పర్యటన రద్దు
వ్రాసిన వారు
Sirish Praharaju
Sep 27, 2024
04:22 pm
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ తిరుమల పర్యటన అనూహ్యంగా రద్దు అయింది.
ఈ సాయంత్రం కాలినడకన తిరుమల చేరుకుని, రేపు (సెప్టెంబరు 28) స్వామివారి దర్శనం చేసుకోవాలని జగన్ యోచించారు.
అయితే, గతంలో మాదిరిగానే జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల ఆలయంలో అడుగుపెట్టకూడదని కూటమి పార్టీలు, ఇతర హిందూ ధార్మిక సంస్థలు తీవ్రంగా హెచ్చరించాయి.
అలాగే, జగన్ తిరుమల పర్యటనను అడ్డుకునే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వస్తున్నాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో, జగన్ తిరుమల పర్యటన సాఫీగా సాగేనా? అనే సందేహాలు పెరిగాయి.
ఈ నేపథ్యంలో, జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. త్వరలోనే జగన్ మీడియా ముందు రాబోతోందని సమాచారం అందుతోంది.