వైఎస్ జగన్ సంస్థలు జగతి, భారతి, ఎంపీ విజయసాయి రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సంస్థలకు సుప్రీంకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసు వ్యవహారంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన జాబితాలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, భారతి సిమెంట్స్‌తో పాటు జగతి పబ్లికేషన్స్ ఉన్నాయి. జగన్ అక్రమాస్తుల కేసు విచారణను ఈడీ, సీబీఐ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే కేసులో సీబీఐ విచారణ జరిగేంత వరకు ఈడీ తన విచారణను ఆపాలని గతంలోనే ట్రయల్ కోర్టును తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సెప్టెంబర్ 5వ తేదీలోగా సమాధానం చెప్పాలని ధర్మాసనం నోటీసులు జారీచేసింది.
సెప్టెంబర్ 5వ తేదీలోపు సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశం
#JUSTIN Supreme Court issues notices to Jagan and other accused in Disproportionate Assets cases. ED approached the Apex Court on Telangana High Court's Division Bench that ED cases should be trialed only after there are judgments come in the CBI cases.— MIRCHI9 (@Mirchi9) July 5, 2023