
Ambedkar Statue: ఈ నెల 19న భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న జగన్
ఈ వార్తాకథనం ఏంటి
విజయవాడలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అంబేద్కర్ స్మృతి వనం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.
ఈ నెల 19న విజయవాడలో 125 అడుగుల బాబా సాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని వై.ఎస్.జగన్ ఆవిష్కరించనున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమ ఏర్పాట్లను విజయసాయిరెడ్డి పరిశీలించారు. ఆయన వెంట సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ ముఖ్య నాయకులు, అధికారులు కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు.
Details
స్వరాజ్ మైదానం మధ్యలో అంబేద్కర్ విగ్రహం
అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.రూ.400 కోట్ల నిధులతో చరిత్రలో నిలిచేలా ఈ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ నిర్మించారన్నారు.
అన్ని వర్గాలతో పాటుగా ఎస్సీలు కూడా సమానంగా అభివృద్ది చెందేలా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చూశారని గుర్తు చేశారు.
విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న 18.8 ఎకరాల స్వరాజ్ మైదానం (పిడబ్ల్యుడి గ్రౌండ్స్) మధ్యలో ఈ విగ్రహం ఉంది.