LOADING...
విశాఖపట్నంలో 'గ్లోబల్ టెక్ సమ్మిట్'- వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్
విశాఖపట్నంలో 'గ్లోబల్ టెక్ సమ్మిట్'ను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్

విశాఖపట్నంలో 'గ్లోబల్ టెక్ సమ్మిట్'- వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్

వ్రాసిన వారు Stalin
Feb 16, 2023
11:26 am

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్నంలోని వీఎంఆర్‌డీఏ చిల్ర్‌టన్‌ ఎరీనాలో 'గ్లోబల్‌ టెక్‌ సమ్మిట్‌' ప్రారంభమైంది. గురువారం, శుక్రవారం జరగనున్న ఈ ఈవెంట్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ఫార్మా, వ్యవసాయ రంగాల ఆవిష్కరణలపై చర్చించనున్నారు. ఉదయం 10గంటలకు సీఎం జగన్‌ వర్చువల్‌గా ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు. అలాగే 'గ్లోబల్‌ టెక్‌ సమ్మిట్‌'లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కీలక ప్రసంగం చేయనున్నారు. సదస్సులో జీ-20 దేశాలతో పాటు 25 దేశాల నుంచి 300 మంది ప్రతినిధులు, 300 వరకు ఐటీ కంపెనీలు పాల్గొన్నారు. మొత్తం వెయ్యి మంది వరకు ప్రతినిధులు హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్

విశాఖలో యూరోపియన్ బిజినెస్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఎలా అనుసరించాలి? వ్యవసాయ ఉత్పత్తులను ఎలా ఎగుమతి చేయాలి? అవసరమైన నాణ్యతా ప్రమాణాలు తదితర అంశాలపై 'గ్లోబల్‌ టెక్‌ సమ్మిట్‌'లో సుధీర్ఘ చర్చ జరగనుంది. విశాఖలో యూరోపియన్ బిజినెస్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తామని, ఇక్కడి వ్యవసాయ పద్ధతులపై వారికి అవగాహన కల్పిస్తామని పల్సస్‌ కంపెనీ సీఈవో, సమ్మిట్‌ కో-కన్వీనర్‌ గేదెల శ్రీనుబాబు వెల్లడించారు. సదస్సులో తొలిరోజు డిజిటల్ కాన్సెప్ట్ ఆఫ్ ఇండియా, ఫార్మా రంగంలో టెక్నాలజీని వినియోగించుకుని ప్రజలకు సులువుగా, చౌకగా మందులు అందజేయడం, టెక్నాలజీని వినియోగించుకోవడంపై చర్చ జరుగనుంది.