Page Loader
విదేశాల్లో సేవా కార్యక్రమాలు
సీఎం జగన్మోహరెడ్డి పుట్టినరోజు వేడుకలు

విదేశాల్లో సేవా కార్యక్రమాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 21, 2022
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకులు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, విదేశాల్లో పెద్ద ఎత్తున అభిమానులు చేపట్టారు. సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు వైసీపీ క్యాడర్ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడం, పేదలకు అన్నదానం, వస్త్రదానం, ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు అందజేయనున్నారు. రెడ్ క్రాస్ సంస్థతో కలిసి రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజు వేడుకలు మూడు రోజులు నిర్వహించాలని వైసీపీ పిలుపునిచ్చింది. తొలిరోజు క్రీడా పోటీలు నిర్వహించగా.. విశేష స్పందన లభించింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు, అనంతపురంలో ఎమ్మెల్యే వెంకట రామిరెడ్డి మొక్కలు నాటారు.

సీఎం జగన్

'98 శాతం హామీలను నెరవేర్చాం'

దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98 శాతం హామీలను అమలు చేశామని, వైసీపీ అధిష్టానం చెబుతోంది. మూడున్నరేళ్లలో డీబీటీ రూపంలో లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1,77,585.51 కోట్లు జమయ్యాయి. గృహ ప్లాట్లు, ఆరోగ్యశ్రీ, ఇతర పథకాల ద్వారా రూ.1,41,642.35 కోట్ల ప్రయోజనం నాన్-డిబిటి రూపంలో అందించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ సీఎం జన్మదినాన్ని పురస్కరించుకుని 21 కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రెడ్‌క్రాస్‌, వైఎస్‌ఆర్‌సీపీ సంయుక్తంగా 175 నియోజకవర్గాల్లో బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు కేంద్ర కార్యాలయంలో దివంగత సీఎం వైఎస్‌ఆర్‌కు నివాళులర్పించి, సేవా కార్యక్రమాలను పార్టీ నాయకులు ప్రారంభించనున్నారు.