YS JAGAN: ఇలా ఎందుకు జరిగిందో తెలీదు.. మీడియా సమావేశంలో జగన్
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాల అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు .మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చాం అన్నారు. ఏపీ ప్రజల కోసం ఎంతో చేయాలని తాపత్రయ పడ్డామన్న ఆయన అవ్వా తాతల ప్రేమ ఏమైందో తెలీదన్నారు . కూటమి విజయానికి అభినందనలు తెలిపారు. సంక్షేమ ఫలితాలు కాపాడలేక పోయాయి . దేవుడి నిర్ణయాన్ని శిరసావహిస్తున్నాను అన్నారు .ప్రతిపక్షంలో ఉండటం కొత్త కాదు .పోరాటం చేస్తానని చెప్పారు రాజకీయ జీవితం అంతా ప్రతిపక్షంలో గడిపా, ఇంకా 5 సంవత్సరాలు గడుపుతానన్నారు . అన్నిటికి సిద్ధంగా ఉన్నామని.. ఫలితాలు మాత్రం ఆశ్చర్యం కలిగించాయన్నారు.
ఎక్కవకాలం ప్రతిపక్షంలో ఉన్నాం: జగన్
అక్క,చెల్లెమ్మలు ఓట్లు ఏమయ్యాయో తెలీదన్న ఆయన... లక్షలమంది అవ్వాతాతలకు తోడుగా ఉన్నామన్నారు . 99 శాతం వాగ్దానాలు అమలు చేసామని.. పిల్లల చదువులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చాం అన్నారు . ఇంగ్లిష్ మీడియం చదువు అందించామని, అవినీతి లేకుండా పరిపాలించాం .ఆటోలు, రిక్షాల వారికి అండగా ఉన్నామని,నేతన్నలకు నేతన్న నేస్తం ఇచ్చామని మత్స్య కారులకు తోడుగా ఉన్నామన్నారు .మహిళా సాధికారతకు కృషి చేశామన్నారు . రైతు భరోసా, ఉచిత ఇన్సూరెన్స్ కల్పించామని..రైతన్నల ప్రేమ ఏమైందో తెలీదని ఆవేదన వ్యక్తం చేశారు. .ఇకనుంచి ఇంకా గుండె ధైర్యంతో పోరాడుతామని విశ్వాసం వ్యక్తం చేశారు .