Page Loader
Guntur: జగన్‌ సహా మరో 8మంది వైసీపీ నేతలపై కేసు నమోదు
జగన్‌ సహా మరో 8మంది వైసీపీ నేతలపై కేసు నమోదు

Guntur: జగన్‌ సహా మరో 8మంది వైసీపీ నేతలపై కేసు నమోదు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 19, 2025
10:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌ సహా మరో ఎనిమిది మంది వైసీపీ నేతలపై గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అమల్లో ఉందని అధికారులు హెచ్చరించినా పట్టించుకోకుండా, గుంటూరు మిర్చియార్డులో వైసీపీ నేతలు కార్యక్రమాన్ని నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా పర్యటించిన జగన్‌తో పాటు ఆ పార్టీ నాయకులు కొడాలి నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేశ్‌, పిన్నెల్లి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాలు 

 ఇబ్బందులు పడిన  రైతులు 

జగన్‌ పర్యటన కారణంగా మిర్చి యార్డు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై వైసీపీ నేతలు, కార్యకర్తలు నిరంకుశంగా వాహనాలను పార్క్‌ చేయడంతో రైతులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. మిర్చి యార్డులోకి సరుకులు తీసుకెళ్లే వాహనాలతో పాటు, పంటలు అమ్మేందుకు వచ్చిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మిర్చి లోడ్ చేసిన లారీలు, వ్యాన్లు రోడ్డుపైనే నిలిచిపోయాయి.