
AP CM YS Jagan Election Campagain: మరో ఎన్నికల విజయయాత్రకు ఏపీ సీఎం వైఎస్ జగన్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్'లో ఎన్నికల నామినేషన్ (Naminations) ప్రక్రియ ముగియడంతో సీఎం వై.ఎస్.జగన్ (YS Jagan) మరోసారి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు.
నవరత్నాల (Navarathnalu) పథకాలకు నిధులు పెంచుతూ శనివారం మేనిఫెస్టోను విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్ రేపటి నుంచి విజయయాత్రకు సిద్ధమవుతున్నారు.
రోజుకు మూడు చోట్ల భారీ బహిరంగ సభల్లో పాల్గొనేలా వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేసింది.
ఈ మేరకు సీఎం వైఎస్ జగన్ మొదటి నాలుగు రోజుల షెడ్యూల్ ను పార్టీ కార్యాలయం ఇప్పటికే విడుదల చేసింది.
ఆదివారం ఉదయం పదిగంటలకు తాడిపత్రిలోని వైఎస్సార్ సర్కిల్ లో జరిగే సభలో పాల్గొంటారు.
Details
జగన్ షెడ్యూల్ ఇదే..
మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతిలోని వెంకటగిరి త్రిభువని సర్కిల్ జరిగే భారీ బహిరంగ సభలో, మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు కందుకూరు కేఎంసీ సర్కిల్ లో జరిగే సభలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు.
ఈనెల 29 న చోడవరం, పి.గన్నవరం, పొన్నూరు సభల్లో పాల్గొంటారని పార్టీ కార్యాలయం తెలిపింది.
అదేవిధంగా ఈనెల 30న కొండేపి, మైదకూరు, పీలేరు సభల్లో పాల్గొని ప్రసంగిస్తార ని వెల్లడించింది.
ఇక మే1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో జరగనున్న భారీ బహిరంగ సభల్లో పాల్గొంటారని వెల్లడించింది.