అసెంబ్లీ సభా హక్కుల కమిటీ చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే
తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక పదవిని కట్టబెట్టారు. ఆసెంబ్లీ సభా హక్కుల కమిటీ చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రివిలేజ్ కమిటీ సభ్యులుగా కోన రఘుపతి, భాగ్యలక్ష్మి, అబ్బయ్య చౌదరి, సుధాకర్ బాబు, అనగాని సత్యప్రసాద్, చిన అప్పలనాయుడు ఉన్నారు. అదే విధంగా అసెంబ్లీ జాయింట్ కమిటీలను కూడా ప్రభుత్వం నియమించింది. 9 జాయింట్ కమిటీలను నియమిస్తూ జగన్ సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది.
అమెనిటీస్ కమిటీ చైర్మన్‌గా తమ్మినేని సీతారాం
అమెనిటీస్ కమిటీ చైర్మన్‌గా శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, వైల్డ్‌లైఫ్ అండ్ ఎన్విరాన్‌మెంట్ కమిటీ చైర్మన్‌గా శాసనసభ స్పీకర్ తమ్మినేని, ఎస్సీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా గొల్ల బాబురావు, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా తెల్లం బాలరాజు, మైనార్టీ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా మహ్మద్ ముస్తఫా, స్త్రీ, శిశు, వృద్దులు, డిసేబుల్డ్ సంక్షేమ కమిటీ చైర్మన్‌గా జొన్నలగడ్డ పద్మావతి, సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వెనకబడిన తరగతుల సంక్షేమ కమిటీ చైర్మన్‌గా రమేష్ యాదవ్ రాజగొల్ల, లైబ్రరీ కమిటీ చైర్మన్‌గా రామసుబ్బారెడ్డి