టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా?
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ నేత, మాజీ మంత్రి, మైదుకూరు నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కడప రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన నాయకుడు డీఎల్ రవీంద్రారెడ్డి చేసి ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి.
వైసీపీ నేతగా ఉండి.. ఆయన సీఎం జగన్‌ను విమర్శంచడం చర్చనీయాంశంగా మారింది. 2024ఎన్నికల్లో వైసీపీకి సింగిల్ డిజిట్ కూడా రాదని చెబుతూనే.. చంద్రబాబే రాష్ట్రానికి దిక్కు అని చెప్పడంతో అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
ఒకవైపు జగన్‌పై విమర్శలు గుప్పిస్తూనే.. మరోవైపు పవన్ కల్యాణ్ నిజాయితీ మెచ్చుకున్నారు. ఇంకోవైపు రాష్ట్రాన్ని చంద్రబాబు తప్ప.. ఏ దేవుడూ కాపాడలేడని చెప్పారు. ఆయన తన రాజకీయ భవిష్యత్‍ను దృష్టిలో పెట్టుకోని ఈ మాటలన్నీ.. అన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
రవీంద్రారెడ్డి
ఎమ్మెల్యే టికెట్ అడిగితే.. ఎంపీ సీటు ఆఫర్?
డీఎల్ రవీంద్రారెడ్డి వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని, ఈ మేరకు ఆయన చంద్రబాబుతో మాట్లాడినట్లు సమాచారం.
మైదుకూరు నుంచి రవీంద్రారెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈసారి కూడా అదే సీటును డీఎల్ అడిగారట. దానికి సంబంధించి చంద్రబాబు హామీ ఇవ్వలేదట. కానీ..రాయలసీమ ప్రాంతం నుంచి ఎంపీ టికెట్ ఆఫర్ చేశారట టీడీపీ అధినేత.
ఉమ్మడి కడప జిల్లాలో లోక్‌సభ టిక్కెట్‌ను రవీంద్రారెడ్డికి చంద్రబాబు ఆఫర్ చేశారట. ఈ ఆఫర్‌ను డీఎల్ అయిష్టంగానే అంగీకరించినట్లు తెలుస్తోంది.
కడప వైసీపీ నేతలు కూడా డీఎల్‌కు టీడీపీ ఆఫర్ ఇచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీలో ఉంటూనే.. టీడీపీ అధికార ప్రతినిధిలా ఆయన మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు.