Page Loader
దిల్లీ లిక్కర్ కేసు: వైసీపీ ఎంపీ కుమారుడు రాఘవ రెడ్డి అరెస్ట్
దిల్లీ లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ కుమారుడు అరెస్ట్

దిల్లీ లిక్కర్ కేసు: వైసీపీ ఎంపీ కుమారుడు రాఘవ రెడ్డి అరెస్ట్

వ్రాసిన వారు Stalin
Feb 11, 2023
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ మద్యం కేసు విచారణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు వేగం పెంచడంతో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా దిల్లీ మద్యం కేసు వ్వవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తనయుడు రాఘవ రెడ్డిని ఈడీ అరెస్టు చేసింది. ఇప్పటికే ఈడీ సమర్పించిన చార్జ్ షీట్‌లో ఎంపీ మాగుంట శ్రీనివాసులుతో పాటు రాఘవ పేరను చేర్చిన విషయం తెలిసిందే. రాఘవ రెడ్డి శనివారం మధ్యాహ్నం కోర్టులో హాజరు పర్చనున్నారు.

దిల్లీ

స్పీడు పెంచిన దర్యాప్తు సంస్థలు

దిల్లీ మద్యం కేసులో ఇప్పటికే శిరోమణి అకాలీదళ్ మాజీ ఎమ్మెల్యే దీప్ మల్హోత్రా కుమారుడు, ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ మల్హోత్రా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబును దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి. తాజాగా రాఘవ రెడ్డి అరెస్టు చేయడంతో విచారణలో ఈడీ వేగం పెంచినట్లు కనిపిస్తోంది. కల్వకుంట్ల కవిత, శ్రీనివాసులురెడ్డి, రాఘవ్‌రెడ్డి, శరత్‌రెడ్డి, నియంత్రణలో ఉన్న సౌత్‌గ్రూప్‌.. దిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు అత్యంత సన్నిహితుడు అయిన విజయ్‌నాయర్‌కు రూ. రూ.100 కోట్ల ముడుపులను అందజేసినట్లు ఈడీ ఆరోపించింది. ఆప్‌ నేతలతో కుదిరిన ఒప్పందం వల్ల.. కవిత నియంత్రణలో ఉన్న సౌత్‌గ్రూప్‌కు అవాంఛిత ప్రయోజనాలు చేకూరినట్లు ఈడీ చార్జ్‌షీట్‌లో ఆరోపించింది.