Page Loader
దిల్లీ మద్యం కేసు: వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను అరెస్టు చేసిన ఈడీ
దిల్లీ మద్యం కేసు: వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను అరెస్టు చేసిన ఈడీ

దిల్లీ మద్యం కేసు: వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను అరెస్టు చేసిన ఈడీ

వ్రాసిన వారు Stalin
Feb 08, 2023
02:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ మద్యం కేసులో శిరోమణి అకాలీదళ్ మాజీ ఎమ్మెల్యే దీప్ మల్హోత్రా కుమారుడు, ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ మల్హోత్రాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. గత రెండు రోజుల్లో ఇది రెండో అరెస్టు కావడం గమనార్హం. ఇప్పటికే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది. కేసు విచారణకు సహకరించకపోడవడం, అతని కదలికలపై అనుమానం వ్యక్తం చేసిన సీబీఐ, మంగళవారం సాయంత్రం బుచ్చిబాబును అదుపులోకి తీసుకుంది.

ఈడీ

గౌతమ్ మల్హోత్రాకు లిక్కర్ వ్యాపారులతో సత్ససంబంధాలు!

దిల్లీ మద్యం పాలిసీ రూపకల్పనలో గౌతమ్ మల్హోత్రా కీలక పాత్ర పోషించినట్లు ఈడీ అభియోగాలు మోపింది. అలాగే లిక్కర్ వ్యాపారులతో గౌతమ్ మల్హోత్రాకు సన్నిహిత సంబంధాలున్నాయని ఈడీ అనుమానిస్తోంది. గౌతమ్ మల్హోత్రాను ఈడీ అధికారులు సాయంత్రం రౌస్ రెవెన్యూ స్పెషల్ కోర్టులో హాజరు పర్చనున్నారు. కవిత, శ్రీనివాసులురెడ్డి, రాఘవ్‌రెడ్డి, శరత్‌రెడ్డి, నియంత్రణలో ఉన్న సౌత్‌గ్రూప్‌.. దిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు అత్యంత సన్నిహితుడు అయిన విజయ్‌నాయర్‌కు రూ. రూ.100 కోట్ల ముడుపులను అందజేసినట్లు ఈడీ ఆరోపించింది. ఆప్‌ నేతలతో కుదిరిన ఒప్పందం వల్ల.. కవిత నియంత్రణలో ఉన్న సౌత్‌గ్రూప్‌కు అవాంఛిత ప్రయోజనాలు చేకూరినట్లు ఈడీ మొదటి చార్జ్‌షీట్‌లో ఆరోపించింది. రెండో‌చార్జ్ షీట్‌లో కూడా కవిత పేరుతోపాటు కేజ్రీవాల్ పేరును ఈడీ చేర్చింది.