LOADING...
YS Jagan-Election Campaign: ఈ ఎన్నికలు పేదోడికి పెత్తం దారులకు మధ్య యుద్ధం: వైఎస్​ జగన్

YS Jagan-Election Campaign: ఈ ఎన్నికలు పేదోడికి పెత్తం దారులకు మధ్య యుద్ధం: వైఎస్​ జగన్

వ్రాసిన వారు Stalin
May 11, 2024
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇప్పుడు జరగబోయే యుద్దం రెండు కులాల మధ్య యుద్ధం కాదని, రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధమని ఏపీ సీఎం జగన్​ (CM Jagan) చెప్పారు. పెత్తందారు ఒకవైపు పేదవాళ్లు ఒకవైపు ఉండి పోరాడే యుద్ధమిదని వివరించారు. ల్యాండ్​ టైటిలింగ్​ చట్టం గురించి వైసీపీ (YCP) ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీ (TDP), జనసేన (Janasena) నాయకులు బాలకృష్ణ (BalaKrishna), పవన్​ కల్యాణ్​ (Pavan Kalyan)లు ఆంధ్రప్రదేశ్​ లో భారీగా భూములు కొన్నారని వారికి ఒరిజినల్​ డాక్యుమెంట్లు ఇచ్చారా లేక నకళ్లు​ ఇచ్చారా అని సీఎం జగన్​ నిలదీశారు. ఏపీలో 9 లక్షలమంది రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని, వారికి ఒరిజినల్​ పత్రాలనే అందజేశామని తెలిపారు. అయినప్పటికీ చంద్రబాబు దుష్ర్పచారం చేస్తున్నారని మండిపడ్డారు.

YS Jagan-Election Campaign

99 శాతం హామీలు నెరవేర్చాం: జగన్​ 

చివరి రోజు ఎన్నికల ప్రచారం లో భాగంగా గుంటూరు జిల్లా చిలకలూరి పేట నియోజకవర్గం పరిధిలో జగన్​ ప్రచారం నిర్వహించారు. మేనిఫెస్టోను ఒక బైబిల్​ లా, ఖురాన్​ లా, భగవద్గీతలా భావించామని, ఇచ్చిన హామీలను 99శాతం నెరవేర్చామని తెలిపారు. మేనిఫెస్టోను ఇచ్చి ఎన్నికలు అయ్యాక చెత్తబుట్టలో పడేసే చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. పేదలకు, అవ్వాతాతలకు పెన్షన్లు, సంక్షేమ పథకాలు అందకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వైద్యం కోసం పేదవాడు ఇబ్బంది పడకుండా, అప్పులు పాలు కాకుండా రూ. 25 లక్షలకు ఆరోగ్యశ్రీని విస్తరించామని తెలిపారు. ఈ వైసీపీ ఐదేళ్లలో 2.31 లక్ష ల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామని వివరించారు.