Page Loader
Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో మొదటి దశ ఓటింగ్ ప్రారంభం.. మొదటి దశలో మొత్తం 24 స్థానాలకు పోలింగ్
జమ్ముకశ్మీర్‌లో మొదటి దశ ఓటింగ్ ప్రారంభం

Jammu Kashmir: జమ్ముకశ్మీర్‌లో మొదటి దశ ఓటింగ్ ప్రారంభం.. మొదటి దశలో మొత్తం 24 స్థానాలకు పోలింగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2024
09:17 am

ఈ వార్తాకథనం ఏంటి

పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, జమ్ముకశ్మీర్‌లో నేటి నుండి అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఆర్టికల్ 370 రద్దు మరియు లడఖ్‌ను విభజించిన తర్వాత, జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన తరువాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి. ఈరోజు(బుధవారం)తొలి దశలో మొత్తం 24స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో 219మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పోలింగ్ కేంద్రాల వద్ద కఠిన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు, వాహన సౌకర్యాలు కూడా సమకూర్చారు. ఈ క్రమంలో ప్రాంతీయ మేజిస్ట్రేట్లు, జోనల్ అధికారులను రంగంలోకి దించారు.మొదటి దశలో పుల్వామాలో 4,షోపియాన్‌లో 2,కుల్గామ్‌లో 3,అనంత్‌నాగ్‌లో 7,రాంబన్‌లో 2,కిష్త్వార్‌లో 3,దోడా జిల్లాలో 3 స్థానాలకు పోలింగ్ జరగనుంది.

వివరాలు 

షగుణ్ పరిహార్‌పై బీజేపీ ఆశలు

సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత, అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఓటర్లను తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రచారం ఎంతమేర ఫలిస్తుందో చూడాలి. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా,ప్రజాదరణ పొందిన అభ్యర్థుల గురించి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఆమె కూడా పోటీ చేస్తున్నారు.మరోవైపు,కేంద్రంలోని అధికార బీజేపీ షగుణ్ పరిహార్‌పై ఆశలు పెట్టుకుంది. భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు గులాం అహ్మద్ మీర్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీరితో పాటు, మాజీ మంత్రి సునీల్ శర్మ, పీడీపీ యువనేత వహీద్ ఉర్ రెహ్మాన్ పారా పేర్లు కూడా ప్రచారంలో బాగా వినిపిస్తున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కాశ్మీర్‌లో ఓటు వేయడానికి వచ్చిన  ప్రజలు