Page Loader
AP Election Results: ఓటమి దిశగా వైసీపీ మంత్రులు.. జిల్లాలో క్లీన్ స్వీప్‌ దిశగా కూటమి.. 
ఓటమి దిశగా వైసీపీ మంత్రులు.. జిల్లాలో క్లీన్ స్వీప్‌ దిశగా కూటమి..

AP Election Results: ఓటమి దిశగా వైసీపీ మంత్రులు.. జిల్లాలో క్లీన్ స్వీప్‌ దిశగా కూటమి.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 04, 2024
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభంజనం ధాటికి వైసీపీ కుదేలైంది. వైసీపీలో పలువురు మంత్రులతో పాటు ముఖ్యనేతలు ఓటమి బాటను పడుతున్నారు. వైసీపీ మంత్రుల్లో ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్నదొర, గుడివాడ అమర్‌నాథ్‌, దాడిశెట్టి రాజా, కొట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేశ్‌, ఆర్కే రోజా, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, విడదల రజనీ, మేరుగు నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఉష శ్రీచరణ్‌ తదితరులు వెనుకంజలో కొనసాగుతున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోనూ కూటమి గట్టి పోటీ ఇస్తోంది.

Details 

జిల్లాలకు జిల్లాలనే కూటమి స్వీప్‌

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలకు జిల్లాలనే కూటమి స్వీప్‌ చేసేలా కనిపిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 స్థానాలకు 12, చిత్తూరులో 14కు 12 చోట్ల కూటమి అభ్యర్థులు ముందంజలో ఉండగా.. తూర్పుగోదావరిలో 19కి 19, గుంటూరులో 17కి 16, కడప 10లో 6 చోట్ల లీడ్‌లో కొనసాగుతున్నారు. కృష్ణా జిల్లాలో 16కి 15, కర్నూలులో 14కి 11, నెల్లూరులో 10కి 8 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రకాశం జిల్లాలో 12 స్థానాలకు 10 శ్రీకాకుళంలో 10కి 9, విశాఖపట్నంలో 15కి 13, విజయనగరంలో 9కి 8, పశ్చిమగోదావరి జిల్లాలో 15కి 14 చోట్ల లీడ్‌లో కొనసాగుతున్నారు.