Nominations withdraw-Lastdate: బరిలో నిలిచేదెవరు? నామినేషన్లు ఉపసంహరించుకునేదెవరు? కొన్ని గంటల్లో రానున్న స్పష్టత
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)సార్వత్రిక ఎన్నికలతో పాటు తెలంగాణ(Telangana)లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections)కూడా ఒకే రోజు జరగనున్నాయి ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. ఎన్నికల అధికారులు వాటిని స్క్రూట్నీ కూడా చేసేసారు. అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు(Nominations Withdraw)సోమవారం చివరి రోజు కానుంది. ఎవరెవరు నామినేషన్లు ఉపసంహరించుకుంటారు అన్నది మరికొన్ని గంటల్లో తెలుస్తుంది. కొన్ని స్థానాల్లో కొంతమంది అభ్యర్థులు రెబల్స్ గా నామినేషన్లు వేయడంతో ప్రధాన పార్టీలకు తలపోటుగా మారింది. ప్రధాన రాజకీయ పార్టీలు(Political Parties)రెబల్(Rebels)అభ్యర్థులను బుజ్జగించి నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేస్తాయా లేదా అన్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఇక స్వతంత్ర అభ్యర్థులుగా తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటారా లేదా బరిలో కొనసాగుతారా అన్నది కూడా ఇవాళ్టితో తేలిపోనుంది.
ఏపీ అసెంబ్లీకి 6001 నామినేషన్లు..తెలంగాణ పార్లమెంట్ కు 771 నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 6,001 నామినేషన్లు దాఖలు కాగా,25 పార్లమెంట్ సెగ్మెంట్లకు 1,103 నామినేషన్లు దాఖలయ్యాయి. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి దాఖలైన 6001 నామినేషన్లలో 1,637 నామినేషన్లు వివిధ కారణాలతో ఎన్నికల అధికారులు తిరస్కరించారు. కేవలం 4,189 నామినేషన్లు మాత్రమే ఆమోదం పొందాయి. పార్లమెంటు సెగ్మెంట్ కి వస్తే 771 నామినేషన్లను ఆమోదించారు. 291 నామినేషన్లు అధికారులు తిరస్కరించారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలు భారీగా స్వతంత్ర అభ్యర్థులు డమ్మీ అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు రెండు నుంచి నాలుగు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. సోమవారం నామినేషన్లు ఉపసంహరణకు చివరి రోజు కావడంతో బరిలో నిలిచేదెవరు ఎవరెవరు ఎవరిపై పోటీపడుతున్నారనేది కొన్ని గంటల్లో తెలిసిపోనుంది .