Page Loader
Houthis: యెమెన్‌లో హౌతీలే లక్ష్యంగా అమెరికా, బ్రిటన్ ప్రతీకార దాడి
Houthis: యెమెన్‌లో హౌతీలే లక్ష్యంగా అమెరికా, బ్రిటన్ ప్రతీకార దాడి

Houthis: యెమెన్‌లో హౌతీలే లక్ష్యంగా అమెరికా, బ్రిటన్ ప్రతీకార దాడి

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 12, 2024
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎర్ర సముద్రంలో (Red Sea)వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్న హౌతీ రెబల్స్‌ (Houthis)పై అమెరికా, బ్రిటన్‌ సైన్యాలు శుక్రవారం ప్రతీకార దాడులు ప్రారంభించాయి. యెమెన్‌లో (Yemen) హౌతీల స్థావరాలపై బాంబుల వర్షం కురిపించినట్లు రాయిటర్స్‌ ధృవీకరించింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ గురువారం మాట్లాడుతూ.. "హౌతీలు నేరుగా అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకున్నారు. జలమార్గాల్లో రవాణా స్వేచ్ఛపై హౌతీ (Houthis) తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డారు. దానికోసం వారు ఉపయోగించిన యెమెన్‌లోని అనేక స్థావరాలపై విజయవంతంగా దాడి చేశాం. అంతర్జాతీయ వాణిజ్య స్వేచ్ఛను రవాణాను రక్షించడానికి మరిన్ని చర్యలు తీసుకోవడానికీ వెనుకాడబోం'' అని హెచ్చరించారు. హౌతీ అధికారి రాజధాని సనాలో సాదా,ధామర్ నగరాలతో పాటు హోడైదా గవర్నరేట్‌లో "దాడులు" చేసినట్లు ధృవీకరించారు.

Details 

యూరప్, ఆసియా కీలక మార్గంలో అంతర్జాతీయ వాణిజ్యానికి అంతరాయం

ఒక US అధికారి, అక్కడి పరిస్థితిపై మాట్లాడుతూ, విమానం, ఓడ, జలాంతర్గామి ద్వారా దాడులు జరుగుతున్నాయని చెప్పారు. గాజాను నియంత్రించే పాలస్తీనా ఇస్లామిస్ట్ గ్రూపు హమాస్‌కు మద్దతుగా తమ దాడులు జరుగుతున్నాయని హౌతీలు చెబుతున్నారు. హౌతీలు ఇప్పటి వరకు 27 నౌకలపై దాడి చేశారు. దింతో ప్రపంచ షిప్పింగ్ ట్రాఫిక్‌లో 15% వాటా కలిగిన యూరప్, ఆసియా కీలక మార్గంలో అంతర్జాతీయ వాణిజ్యానికి అంతరాయం కలిగింది. అంతకుముందు గురువారం, హౌతీల నాయకుడు యుఎస్ దాడి పై స్పందించారు. యెమెన్‌లోని తమ స్థావరాలపై దాడికి తీవ్ర సైనిక ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు.

Details 

ఎర్రసముద్రంలో 27 దాడులు చేసిన హౌతీలు

గల్ఫ్ ఆఫ్ అడెన్‌లోని అంతర్జాతీయ షిప్పింగ్ లేన్‌లపైకి హౌతీలు యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారని, గత ఏడాది నవంబర్ 19 నుంచి హౌతీలు ఇప్పటి వరకు ఎర్రసముద్రంలో 27 దాడులు చేసిందని US మిలిటరీ గురువారం తెలిపింది. గత ఏడాది డిసెంబరులో, 20 కంటే ఎక్కువ దేశాలు US నేతృత్వంలోని సంకీర్ణంలో పాల్గొనడానికి అంగీకరించాయి. దీనిని ఆపరేషన్ ప్రాస్పిరిటీ గార్డియన్ అని పిలుస్తారు.ఇది ఎర్ర సముద్రంలో వాణిజ్య ట్రాఫిక్‌ను కాపాడుతుంది. అయితే, US, బ్రిటీష్ దాడులు ఆ రక్షణాత్మక కూటమి వెలుపల జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా, బహ్రెయిన్,కెనడానెదర్లాండ్స్ ఆపరేషన్‌కు మద్దతు ఇచ్చాయని బైడెన్ చెప్పారు. ఈ నిర్లక్ష్యపు దాడులకు అంతర్జాతీయ సమాజం ప్రతిస్పందన ఐక్యంగా,దృఢంగా ఉంది" అని బైడెన్ ఒక ప్రకటనలో తెలిపారు.