
Houthi Rebels: ఎర్ర సముద్రంలో హౌతీ క్షిపణులు, డ్రోన్‌లను కూల్చివేసిన అమెరికా, బ్రిటన్ బలగాలు
ఈ వార్తాకథనం ఏంటి
యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ (Houthis)మంగళవారం దక్షిణ ఎర్ర సముద్రంలోకి అంతర్జాతీయ షిప్పింగ్ లేన్‌ల వైపు కాల్పులు జరిపిన 21 డ్రోన్‌లు, క్షిపణులను యుఎస్,యుకె దళాలు కూల్చివేసినట్లు యుఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ తెలిపింది.
ఈ ఘటనలో ఎటువంటి గాయాలు కాలేదని U.S. సెంట్రల్ కమాండ్ తెలిపింది. నవంబర్ 19 నుండి ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకా మార్గాలపై హౌతీల దాడి చేస్తున్నారు.
గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధానికి నిరసనగా ఇరాన్ మద్దతుగల హౌతీ మిలిటెంట్లు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులను వేగవంతం చేశారు.
Details
యుఎస్ యుద్ధనౌకలపై దాడి చేస్తామని హెచ్చరిక
హౌతీ అంతర్జాతీయ షిప్పింగ్‌కు విఘాతం కలిగిస్తుండడంతో కొన్ని కంపెనీలు ఎర్ర సముద్రం గుండా రవాణాను కూడా నిలిపివేసాయి.
దానికి బదులుగా ఎక్కువ ఖర్చు పెట్టి ఆఫ్రికా చుట్టూ నుండి రవాణా చేస్తున్నాయి.
ఇజ్రాయెల్ గాజాలో యుధం ఆపే వరకు దాడులను కొనసాగిస్తామని హౌతీలు ప్రతిజ్ఞ చేశారు.
మిలీషియా గ్రూపును లక్ష్యంగా చేసుకుంటే యుఎస్ యుద్ధనౌకలపై దాడి చేస్తామని హెచ్చరించారు.
18 డ్రోన్లు, రెండు యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణులు, ఒక యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణిని అమెరికా, బ్రిటన్ బలగాలు కూల్చివేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది.