Royal Warrant : బ్రిటన్‌లో సంచలనం.. చాక్లెట్ కంపెనీ క్యాడ్‌బరీపై ఆఖరి తీర్పు
బ్రిటన్‌లోని రాయల్ వారెంట్ జాబితాలో ఉన్న 170 ఏళ్ల చాక్లెట్ తయారీ సంస్థ క్యాడ్‌బరీని తొలగించారు. రాజ కుటుంబానికి అధిక ప్రాముఖ్యత కలిగిన ఈ జాబితా నుండి ఈ బ్రాండ్ తొలగించడం ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. క్వీన్ విక్టోరియా 1854లో క్యాడ్‌బరీకి మొదటి రాయల్ వారెంట్‌ను జారీ చేశారు. ఆ తర్వాత క్యాడ్‌బరీ 170 సంవత్సరాల పాటు బ్రిటన్ యొక్క ఇష్టమైన చాక్లెట్ బ్రాండ్‌గా రాయల్ వారెంట్ పొందింది. ప్రస్తుతం కింగ్ చార్లెస్ III చేత విడుదలైన తాజా రాయల్ వారెంట్‌ల జాబితాలో క్యాడ్‌బరీ పేరు లేకుండా పోయింది.
ఐదేండ్లకోకసారి సమీక్షా
రాయల్ వారెంట్ అనేది బ్రిటన్ వ్యాపారంలో ఒక ప్రత్యేక గుర్తింపు, స్టేటస్ సింబల్. ఈ వారెంట్‌ను రాయల్ కోట్ ఆఫ్ ఆర్మ్స్‌తో సంబంధించి కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్ చేస్తాయి. ఇప్పుడు రాయల్ వారెంట్ ఉన్న సంస్థల సంఖ్య సుమారు 750 కు చేరింది. వీటి సమీక్ష ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. క్యాడ్‌బరీ 1824లో బర్మింగ్‌హామ్‌లో స్థాపించిన ఈ చాక్లెట్ కంపెనీ, సుదీర్ఘ కాలంగా బ్రిటిష్ చాక్లెట్ వారసత్వానికి గుర్తింపు పొందింది.