తదుపరి వార్తా కథనం

King Charles III: బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్‌కు మరోసారి అస్వస్థత
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 28, 2025
08:54 am
ఈ వార్తాకథనం ఏంటి
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III (King Charles III) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. క్యాన్సర్ చికిత్స సమయంలో ఏర్పడ్డ కొన్ని సైడ్ ఎఫెక్ట్‌ల కారణంగా ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించినట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించింది.
ఇటీవల చార్లెస్ III క్యాన్సర్ బారినపడిన సంగతి తెలిసిందే.
అప్పటి నుంచి ఆయన చికిత్స తీసుకుంటున్నారు. అయితే చికిత్స అనంతరం కొన్ని సైడ్‌ఎఫెక్ట్‌లు తలెత్తడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఆస్పత్రికి తరలించినట్లు ప్యాలెస్ వెల్లడించింది.
రాజు ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ గురువారం, శుక్రవారం జరగాల్సిన అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసినట్లు ప్యాలెస్ పేర్కొంది.
వైద్యుల సూచన మేరకు చార్లెస్ III ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలియజేశారు.