Canada vs India: భారత్‌తో దౌత్య వివాదం.. కెనడాకు మద్దతుగా నిలిచిన అమెరికా, బ్రిటన్
41 మంది కెనడా దౌత్యవేత్తలను తగ్గించుకోవాలని ఆ దేశానికి భారత్ గతంలో డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే. అయితే భారత్-కెనడా మధ్య ఉన్న దౌత్యపరమైన విభేదాలపై యునైటెడ్ స్టేట్స్ (అమెరికా), యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) ఆందోళన వ్యక్తం చేశాయి. భారత్‌లో కెనడా దౌత్యపరమైన ఉనికిని తగ్గించాలని డిమాండ్ చేయడం కంటే.. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై విచారణలో కెనడాతో సహకరించాలని అమెరికా, బ్రిటిష్ విదేశాంగ కార్యాలయాలు ఇండియాకు సూచించాయి.
41మంది దౌత్యవేత్తలను వెళ్లిపోయిన ఒకరోజు తర్వాత..
నిజ్జర్ హత్య వెనుక భారత నిఘా వర్గాల హస్తం ఉందని కెడనా ప్రధాని ట్రూడో ఆరోపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో భారత్‌లో కెనడా దౌత్తవేత్తుల పరిమితికి మించి ఉన్నారని, 41మంది దౌత్యవేత్తలను తగ్గించుకోవాలని కెనడాకు భారత్ అల్టిమేటమ్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్రమైన చర్చల అనంతరం.. తమ 41మంది దౌత్య వేత్తలను కెనడా ఉపసంహరించుకున్నది. ఇది జరిగిన ఒకరోజు తర్వాత అమెరికా, బ్రిటన్ కెడనాకు మద్దతుగా ప్రకటనను విడుదల చేశాయి.
వియన్నా ఒప్పందాన్ని గౌరవించాలి: అమెరికా, బ్రిటన్
కెనడాతో దౌత్యపరమైన వివాదాన్ని తగ్గించుకోవాలని, అలాగే నిజ్జర్ హత్యకు సంబంధించిన దర్యాప్తునకు తాము భారత్‌ను కోరుతున్నట్లు అమెరికా డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ పేర్కొన్నారు. అలాగే, కెనడా దౌత్యవేత్తలను తగ్గించాలన్న భారత్ డిమాండ్‌తో బ్రిటన్ విదేశాంగ కార్యాలయం కూడా విభేదించినట్లు సమాచారం. కెనడా దౌత్యవేత్తలకు మంజూరైన అధికారాలు, మినహాయింపులను గౌరవించడంతో సహా దౌత్య సంబంధాలపై 1961 నాటి వియన్నా కన్వెన్షన్ ఒప్పందాన్ని గౌరవించాలని యూకే, అమెరికా కోరుతున్నాయి. దౌత్యపరమైన సమానత్వాన్ని అమలు చేయడాన్ని అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించడమేనన్నవాదనలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది.