ఇద్దరు అమెరికన్ బంధీలను విడుదల చేసిన హమాస్ మిలిటెంట్లు
ఈ వార్తాకథనం ఏంటి
తమ బంధీలుగా ఉన్న ఇద్దరు అమెరికన్లను హమాస్ మిలిటెంట్లు శుక్రవారం రాత్రి విడుదల చేశారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రభుత్వం ధువీకరించింది.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు ఆకస్మిక దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దాదాపు 200 మందిని హమాస్ మిలిటెంట్లు బంధీలుగా తీసుకున్నారు.
అందులో ఇద్దరు అమెరికన్లు ఉన్నారు. బంధీలను విడిపించేందుకు ఖతార్, ఈజిప్ట్ దేశాలు హమాస్‌తో చర్చలు జరుపుతున్నాయి.
ఈ క్రమంలో ఇప్పుడు ఇద్దరు అమెరికన్లను తాజాగా విడుదల చేయగా, తర్వరలోనే మరింత మందిని విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
హమాస్
విడుదలైన వారితో మాట్లాడిన బైడెన్
అమెరికాకు చెందిన జుడిత్ తై రానన్, ఆమె కుమార్తె నటాలీ శోషనా రానన్ శుక్రవారం రాత్రి ఇజ్రాయెల్‌కు చేరుకున్నారని ఆ ప్రభుత్వం తెలిపింది.
అయితే వారి ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి వివరాలను ఇజ్రాయెల్ ప్రభుత్వం వెల్లడించలేదు. హమాస్ నుంచి విడుదలైన ఇద్దరు అమెరికన్లతో అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్‌లో మాట్లాడారు.
హమాస్ చేతిలో బంధీలుగా ఉన్న వారిని విడిపించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం పేర్కొంది.
హమాస్ మిలిటెంట్లు కిడ్నాప్ చేసిన వారందరినీ వారి ఇళ్లకు సురక్షితంగా చేర్చేందుకు అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తున్నట్లు వెల్లడించింది.