Virat Kohli : సూపర్ ఫామ్‌లో కోహ్లీ.. వరుసగా రెండో వన్డేలోనూ సెంచరీ..
ఈ వార్తాకథనం ఏంటి
టీమ్ఇండియా సీనియర్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆ సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు.వరుసగా రెండో వన్డే మ్యాచ్‌లోనూ శతక సాధించాడు. రాంచి వేదికలో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ శతకానికి దూసుకెళ్లిన తర్వాత, రాయ్‌పుర్‌లో జరుగుతున్న రెండో వన్డేలో కూడా మూడు అంకెల స్కోరు నమోదు చేశాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో కోహ్లీ 90 బంతుల్లో సెంచరీ పూర్తి చేశారు.ఇందులో 7 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.
వివరాలు
కోహ్లీ కెరీర్‌లో 11వసారి వరుస రెండు వన్డేల్లో శతకం
వన్డేల్లో ఇది కోహ్లీకి 53వ శతకం. వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు ప్రస్తుతం కోహ్లీ పేరిటే ఉంది ఈ మ్యాచ్‌లో మొత్తం 93 బంతులు ఎదుర్కొని, 7 ఫోర్లు, 2 సిక్సర్ల ద్వారా 102 పరుగులు చేసాడు. ఆ తర్వాత ఎంగిడి బౌలింగ్‌లో మార్‌క్రామ్ క్యాచ్ అవ్వడంతో కోహ్లీ ఔట్ అయ్యాడు. వీటితో, వరుస రెండు వన్డేల్లో శతక సాధించడం కోహ్లీ కెరీర్‌లో 11వసారి జరిగింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బీసీసీఐ చేసిన ట్వీట్
𝙐𝙣𝙨𝙩𝙤𝙥𝙥𝙖𝙗𝙡𝙚! 👑
— BCCI (@BCCI) December 3, 2025
BACK to BACK ODI HUNDREDS for Virat Kohli 🫡🫡
His 5⃣3⃣rd in ODIs 💯
Updates ▶️ https://t.co/oBs0Ns6SqR#TeamIndia | #INDvSA | @IDFCFIRSTBank | @imVkohli pic.twitter.com/sahZeIUo19