LOADING...
dhurandhar movie: 17 ఏళ్ల తర్వాత అత్యంత నిడివితో విడుదల అవుతున్న బాలీవుడ్ సినిమా ఇదే!
17 ఏళ్ల తర్వాత అత్యంత నిడివితో విడుదల అవుతున్న బాలీవుడ్ సినిమా ఇదే!

dhurandhar movie: 17 ఏళ్ల తర్వాత అత్యంత నిడివితో విడుదల అవుతున్న బాలీవుడ్ సినిమా ఇదే!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 03, 2025
04:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పుడు సినిమాల నిడివి ఎక్కువగా ఉండే చిత్రాలు అరుదుగా వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దర్శకుల సృజనాత్మక విజన్‌కి ఆధునిక సాంకేతికత దోహదం కావడంతో సినిమాల నిడివి పెరుగుతూ, కొన్ని సినిమాలు రెండు లేదా మూడు భాగాలుగా కూడా విడుదలవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాలీవుడ్‌లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన చిత్రం 'ధురంధర్‌'. రణ్‌వీర్ సింగ్ కథానాయకుడుగా, ఆదిత్య ధర్‌ దర్శకత్వంలో రూపొందించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా సెన్సార్ పూర్తి అయ్యి, సినిమాకు A సర్టిఫికెట్ మంజూరు చేశారు. అదనంగా, గణనీయమైన హింసాత్మక సన్నివేశాలు ఉండటంతో, 18+ ప్రేక్షకుల కోసం మాత్రమే అనుమతించబడింది అని సీబీఎఫ్‌సీ ప్రకటించింది.

వివరాలు 

'జోథా అక్బర్‌' 3.50 గంటల నిడివి గల చిత్రం 

ఈ సినిమా నిడివి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రన్‌టైమ్ 3.34 గంటలుగా నిర్ణయించబడింది. భారతీయ సినీ చరిత్రలో అత్యధిక నిడివి కలిగిన సినిమాల జాబితాలో 'ధురంధర్‌' కూడా చేరింది. ఇక బాలీవుడ్‌లో 17ఏళ్ల తర్వాత ఈ స్థాయి నిడివితో వస్తున్న మూవీ ఇదే కావడం గమనార్హం. 2008లో హృతిక్ రోషన్ నటించిన 'జోథా అక్బర్‌' (3.50 గంటలు) తర్వాత, మరే హిందీ చిత్రం ఇంత నిడివితో రాలేదు. ఇటీవల విడుదలైన 'పుష్ప2' 3.21 గంటల రన్‌టైమ్‌తో విడుదలైన సంగతి తెలిసిందే.

వివరాలు 

మోహిత్ శర్మ జీవితకథతో దీనికి సంబంధం లేదు: సీబీఎఫ్‌సీ 

మరోవైపు ఈ సినిమా మేజర్ మోహిత్ శర్మ జీవితంపై ఆధారపడిందనే వార్తలపై దర్శకుడు స్పష్టత ఇచ్చారు. "ఇది ఎవరి బయోపిక్‌ కాదు. భవిష్యత్తులో మోహిత్ శర్మపై బయోపిక్‌ రూపొందించాలనుకుంటే, వారి కుటుంబసభ్యుల అనుమతి తీసుకొని మాత్రమే అధికారికంగా ప్రకటిస్తాం.దేశ కోసం ఆయన చేసిన త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. ఆ బయోపిక్‌ గౌరవంగా రూపొందిస్తాము. 'ధురంధర్‌'లో ఆయన గురించి చూపించలేదు" అని స్పష్టంచేశారు. అయితే, మోహిత్ శర్మ తల్లిదండ్రులు ఈ విషయంపై దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సినిమాను తమకు ప్రత్యేకంగా చూపించాలని, అప్పటివరకు విడుదలను నిలిపివేయాలని వారు కోర్టును అభ్యర్థించారు. దీని ఫలితంగా, హైకోర్టు ఆదేశాల ప్రకారం సీబీఎఫ్‌సీ సినిమా పునఃపరిశీలన చేసి, మోహిత్ శర్మ జీవితకథతో దీనికి సంబంధం లేదని ప్రకటించింది.

Advertisement