McKinsey and Company: ఉద్యోగస్తులకు కంపెనీ బంపర్ ఆఫర్.. సంస్థను వీడితే 9నెలల జీతం
అంతర్జాతీయంగా పేరొందిన బ్రిటన్ కు చెందిన గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ మెక్ కిన్సే తమ ఉద్యోగులకు వదిలించుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తమ సంస్థను వీడాలనుకునే సీనియర్ ఉద్యోగులకు ఏకంగా 9 నెలల జీతాన్ని ఇస్తామని ప్రకటించినట్లు బిట్రిష్ డైలీ ద టైమ్స్ పత్రిక వెల్లడించింది. సంస్థ మేనేజర్లతో సహా సీనియర్ ఉద్యోగులు మరో ఉద్యోగ అవకాశాలు పొందేందుకు 9 నెలల వరకు సమయాన్ని మెక్ కీన్స్ సంస్థ ఇచ్చింది. ఈ 9 నెలల కాలంలో కొత్త ఉద్యోగం పొందేందుకు తమ పనివేళల్ని కూడా ఉపయోగించుకోవచ్చని, లేదంటే క్లయింట్ ప్రాజెక్టులలో కూడా పాల్గొనవచ్చని సంస్థ స్పష్టం చేసింది. ఈ సమయంలో ఎటువంటి కోతలు లేకుండా పూర్తి జీతాన్ని చెల్లిస్తామని వెల్లడించింది.