Page Loader
Israel: ఇజ్రాయెల్‌లో ఇద్దరు బ్రిటన్ ఎంపీలు నిర్భందం.. విదేశాంగ శాఖ తీవ్ర అసంతృప్తి
ఇజ్రాయెల్‌లో ఇద్దరు బ్రిటన్ ఎంపీలు నిర్భందం.. విదేశాంగ శాఖ తీవ్ర అసంతృప్తి

Israel: ఇజ్రాయెల్‌లో ఇద్దరు బ్రిటన్ ఎంపీలు నిర్భందం.. విదేశాంగ శాఖ తీవ్ర అసంతృప్తి

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 06, 2025
11:14 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌ (Israel)ను సందర్శించిన బ్రిటన్‌ (UK)కు చెందిన ఇద్దరు ఎంపీలను అక్కడి భద్రతా అధికారులు తాత్కాలికంగా నిర్బంధించిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. టెల్‌ అవీవ్‌ తీసుకున్న ఈ చర్యను యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్‌ లామీ (David Lammy) తీవ్రంగా విమర్శించారు. సంబంధిత అంశంపై పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలను ప్రచురించాయి. లేబర్‌ పార్టీకి చెందిన ఎంపీలు యువాన్‌ యాంగ్‌ (Yuan Yang), అబ్తిసామ్‌ మొహమ్మద్‌ (Abtisam Mohamed) శనివారం లుటాన్‌ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్లారు. యువాన్‌ ఎర్లీ, వుడ్డీ నియోజకవర్గాలను ప్రాతినిధ్యం వహిస్తుండగా, అబ్తిసామ్‌ షెఫీల్డ్‌ సెంట్రల్‌ ఎంపీగా ఉన్నారు. ఈ ఇద్దరిని ఇజ్రాయెల్‌ అధికారులు టెల్‌ అవీవ్‌లో అడ్డుకొని, నిర్బంధించారు.

Details

డాక్యుమెంటేషన్ కారణంగా అనుమానాలు

తర్వాత కొన్ని గంటల తర్వాత వారిని విడిచిపెట్టారు. ఇజ్రాయెల్‌ భద్రతా సంస్థల ప్రకారం, ఎంపీలు తమ భద్రతా దళాల కార్యకలాపాలను డాక్యుమెంట్ చేయడం ద్వారా వారి పై వ్యతిరేకతను పెంచే ఉద్దేశంతో వచ్చారని అనుమానించి, వారి రాకను అడ్డుకున్నట్లు వివరించారు. స్పందించిన డేవిడ్‌ లామీ, "ఇజ్రాయెల్‌ పర్యటనలో ఉన్న బ్రిటన్‌ పార్లమెంటరీ బృందానికి చెందిన ఇద్దరు ఎంపీలను అడ్డుకుని, నిర్బంధించడం ఆమోదయోగ్యం కాదు. ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశం. మా ఎంపీలతో ఇలాంటి వ్యవహారం మేమెప్పటికీ సహించం. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ అధికారులతో స్పష్టం చేశాను. ప్రస్తుతం మేం ఇజ్రాయెల్‌-హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ, గాజాలో శాంతి స్థాపన కోసం జరుగుతున్న చర్చలపైనే దృష్టి కేంద్రీకరించామని ఓ ప్రకటనలో వెల్లడించారు.