Page Loader
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం

వ్రాసిన వారు Stalin
Jul 23, 2023
01:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ ఆరాధే ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన ఆరాధేతో రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ పదోన్నతి పదోన్నతి పొందిన నేపథ్యంలో ఆయన స్థానంలో జస్టిస్ అలోక్ ఆరాధే నియమితులయ్యారు. ఏప్రిల్ 13, 1964న రాయ్‌పూర్‌లో జన్మించిన అలోక్ ఆరాధే జూలై 12, 1988న న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. నవంబర్ 17, 2018న కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఆరాధే ప్రమాణ స్వీకారం చేశారు. జూలై 3, 2022న కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాజ్‌భవన్‌లో జస్టిస్ అలోక్ అరాధే ప్రమాణ స్వీకారోత్సవం