Page Loader
దిల్లీ: 'మీకు వడ్డించడం అంటే చాలా ఇష్టం', కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ కౌంటర్
దిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు లేఖ రాసిన లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా

దిల్లీ: 'మీకు వడ్డించడం అంటే చాలా ఇష్టం', కేజ్రీవాల్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ కౌంటర్

వ్రాసిన వారు Stalin
Jan 20, 2023
05:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా మధ్య మాటల యుద్ధం రోజుకు రోజుకు పెరుగుతోంది. ఇటీవల గవర్నర్‌పై కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్జీని కలిసేందుకు తనకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపణలు చేశారు. ఈ ప్రశ్నలపై సమాధానంగా శుక్రవారం లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా.. కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. తనను కలిసేందుకు కేజ్రీవాల్‌కు అవకాశం ఇవ్వడం లేదని అనడం దురదృష్టకరమన్నారు ఎల్జీ సక్సేనా. తాను సీఎం, డిప్యూటీ సీఎంను ఆహ్వానించానని, మిమ్మల్ని కలవడం, మీకు భోజనం వడ్డించడం అంటే తనకు చాలా ఇష్టమని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలందరినీ ఒకేసారి కలమంటే ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

దిల్లీ

హెడ్మాస్టర్‌గా వ్యవహరించబోను, ప్రజాగళంగా మారుతా: లెఫ్టినెంట్ గవర్నర్

లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? అని కేజ్రివాల్ చేసిన వ్యాఖ్యలపై గవర్నర్ స్పందిస్తూ, భారత రాజ్యాంగాన్ని చూస్తే గవర్నర్ ఎవరో తెలుస్తోందని కౌంటర్ ఇచ్చారు. తాను హెడ్మాస్టర్‌గా వ్యవహరించబోనని కేజ్రివాల్ కు రాసిన లేఖలో గవర్నర్ పేర్కొన్నారు. కొన్నిఅంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం సరైదని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. సమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పారు. సమస్యలను పరిష్కరించే విషయంలో తాను హెడ్మాస్టర్‌గా వ్యవహరించబోనని, ప్రజాగళంగా మారుతానని వెల్లడించారు.