ఆమ్ ఆద్మీ పార్టీకి ఝలక్: ప్రకటనల సొమ్ము రూ. 163కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసులు
దిల్లీలో అధికార పార్టీ అయిన 'ఆప్'కు డీఐపీ విభాగం షాకిచ్చింది. ప్రకటన కోసం వినియోగించిన రూ.163కోట్లు చెల్లించాలని ఆమ్ ఆద్మీ పార్టీకి నోటీసులు జారీ చేసింది. వాస్తవానికి దిల్లీలో ఆప్ ప్రభుత్వం- లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఇటీవల కేజ్రీవాల్ ప్రభుత్వంపై గవర్నర్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం ప్రకటనలను పార్టీ ప్రచారం కేజ్రీవాల్ ప్రభుత్వం వినియోగించుకున్నట్లు సక్సేనా విమర్శించారు. ప్రకటనలకు సంబంధించిన మొత్తం సొమ్మును వడ్డితో పాటు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఇదే విషయంపై దిల్లీ సీఎస్‌కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సీఎస్ ఆదేశాల మేరకు రూ.163.63 డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ( డీఐపీ) ఆప్‌కు నోటీసులు జరీ చేసింది.
10రోజుల్లో చెల్లించకుంటే చర్యలు తప్పవని డీఐపీ హెచ్చరిక
ఆమ్ ఆద్మీ పార్టీ 10రోజుల్లో రూ.163.62కోట్ల మొత్తాన్ని చెల్లించాలని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ తన నోటీసుల్లో పేర్కొంది. ఒక వేళ.. పది రోజుల్లో కట్టకపోతే..చట్ట ప్రకారంచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటనల కోసం ఖర్చు చేసిన అసలు రూ. 99.31కోట్లు కాగా.. వడ్డీతో కలిపి రూ.163.62 చేరినట్లు డీఐపీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. గవర్నర్ తీరుపై దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా స్పందించారు. ఎన్నికైన మంత్రులు, అధికార పార్టీని లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీజేపీ, గవర్నర్ ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు.