Page Loader
ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా వాదించిన కశ్మీర్ లెక్చరర్‌ను ఎందుకు సస్పెండ్ చేశారు?: సుప్రీంకోర్టు 
ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా వాదించిన కశ్మీర్ లెక్చరర్‌ను ఎందుకు సస్పెండ్ చేశారు?: సుప్రీంకోర్టు

ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా వాదించిన కశ్మీర్ లెక్చరర్‌ను ఎందుకు సస్పెండ్ చేశారు?: సుప్రీంకోర్టు 

వ్రాసిన వారు Stalin
Aug 28, 2023
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాఠశాల విద్యా శాఖలోని సీనియర్‌ లెక్చరర్‌గా పని చేస్తున్న జహూర్ అహ్మద్ భట్ సస్పెన్షన్‌కు గల కారణాలపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా భట్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. 370కేసు విచారణ సందర్భంగా సోమవారం ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం సమావేశమైన సమయంలో సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ జహూర్ అహ్మద్ భట్ సస్పెన్షన్ విషయాన్ని లేవనెత్తారు. భట్ కోర్టుకు హాజరైన తర్వాత అతన్ని సస్పెండ్ చేశారని, ఇది సరైంది కాదన్నారు. ఆర్టికల్ 370కి సంబంధించిన కేసులో పిటిషనర్‌గా ఉన్న భట్ ఆగస్టు 23న రాజ్యాంగ ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. ఆగస్టు 25న జమ్ముకశ్మీర్ యంత్రాంగం భట్‌ను సస్పెండ్ చేసింది.

ఆర్టికల్

లెఫ్టినెంట్ గవర్నర్‌తో మాట్లాడి వాస్తవాలను తెలుసుకోండి: సీజేఐ

జహూర్ అహ్మద్ భట్ సస్పెన్షన్ వెనుక ఉన్న కచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌తో మాట్లాడాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆదేశించారు. ప్రతి ఒక్కరికి కోర్టులో హాజరు కావడానికి హక్కు ఉందని, దానికి ప్రతీకారంగా లెక్చరర్‌ను సస్పెండ్ చేయలేమని తుషార్ మెహతా బదులిచ్చారు. ఈ విషయంలో ఇతర సమస్యలు ఉండవచ్చని సొలిసిటర్ జనరల్ పేర్కొన్నారు. అయితే ఆ ఇతర కారణాలు ఏమై ఉంటాయో తెలుసుకోవాలని జస్టిస్ ఎస్‌కే కౌల్ సూచించారు. కోర్టుకు హాజరుకావడానికి, సస్పెన్షన్‌కు మధ్య ఉన్న సంబంధంపై స్పష్టంగా తెలుసుకోవాలని ఆదేశించారు.