Page Loader
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్-2023 సమావేశాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్-2023 సమావేశాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్-2023 సమావేశాలు ప్రారంభం

వ్రాసిన వారు Stalin
Mar 14, 2023
10:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో మొదలయ్యాయి. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పాల్గొంటున్న తొలి అధికారిక కార్యక్రమం ఇదే. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీ, సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ఆంధ్రప్రదేశ్

2023-24 వార్షిక బడ్జెట్ రూ.2.60లక్షల కోట్లు

కనీసం 7 లేదా 8 రోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. మంగళవారం బీఏసీ అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. 2023-24 ఏడాదికి గానూ రూ.2.60లక్షల కోట్ల వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఈ నెల 17న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. సంక్షేమంతో పాటు వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా బడ్జెట్ రూపకల్పనకు ప్రభుత్వం కృషినట్లు తెలుస్తోంది. మరోవైపు నాలుగేళ్ల పాలనతోపాటు మూడు రాజధానులు, సంక్షేమం, వైజాగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ కీలక అంశాలపై సీఎం జగన్‌ అసెంబ్లీలో ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది.