
Telangana Governor: తెలంగాణ గవర్నర్ తమిళిసై అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతా హ్యాక్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అధికారిక X (ట్విట్టర్) ఖాతా @DrTamilsaiGuv హ్యాకింగ్ గురైంది.
ఈమేరకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి.
గవర్నర్‌కు ట్విట్టర్ ఖాతాలో సంబంధం లేని పోస్టులు ఉండటంతో రాజ్ భవన్ వర్గాలు అప్రమత్తమయ్యాయి.
ట్విట్టర్ ఖాతాను లాగిన్ చేసే ప్రయత్నం చేయగా.. సాధ్యం కాకపోవడంతో వెంటనే గవర్నర్ బృందం పోలీసులను ఆశ్రయించింది.
ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు రాజ్ భవన్ అసిస్టెంట్ కంట్రోలర్ వెల్లడించారు.
ప్రస్తుతం గవర్నర్ తమిళిసై ట్విట్టర్ ఖాతా పునరుద్ధరించబడింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
గవర్నర్ ట్విట్టర్ హ్యాక్..#TELANGANA #governor #Twitter #Hacked #CyberAttack #CYBERCRIME @DrTamilisaiGuv @TelanganaGuv @TelanganaCMO @TelanganaDGP pic.twitter.com/rzI7lfFFVZ
— Dial News (@dialnewstelugu) January 17, 2024