తదుపరి వార్తా కథనం

Siddaramaiah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 02, 2024
03:35 pm
ఈ వార్తాకథనం ఏంటి
కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు బిగ్ షాక్ తగిలింది. స్థలాల అక్రమ పంపిణీలో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది.
స్థలాల పంపిణీ అక్రమాలపై గవర్నర్ తవర్ చంద్ గెహ్లాట్ నోటీసులు జారీ చేశారు.
సీఎంకు నోటీసులు ఇవ్వడంపై డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు.
ఈ పరిణామంతో ఒక్కసారిగా కర్నాటక రాజకీయాలు వేడక్కాయి. ఈ క్రమంలో నోటీసులను గవర్నర్ వెనక్కి తీసుకోవాలంటూ మంత్రి ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
Details
సిద్ధరామయ్య విచారణకు రావాలని నోటీసులు
సిద్ధరామయ్య భార్య పార్వతమ్మకు వారసత్వంగా వచ్చిన భూములు తీసుకొని వేరే చోట భూములను మైసూర్ నగరాభివృద్ది సంస్థ ఇచ్చింది.
స్వాధీనం భూముల కంటే ఇచ్చిన భూముల విలువ ఎక్కువగా ఉందని ఆర్టీఐ కార్యకర్త గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
దీనిపై విచారణకు సిద్దరామయ్య హాజరు కావాలంటూ గవర్నర్ నోటీసులు జారీ చేశారు.
ఈ పరిణామంపై ప్రస్తుతం మంత్రివర్గం సిరీయస్ ఉంది.