LOADING...
Opposition in Manipur: మణిపూర్‌లో గవర్నర్‌ను కలిసిన ప్రతిపక్ష కుటమి ఎంపీలు
మణిపూర్‌లో గవర్నర్‌ను కలిసిన ప్రతిపక్ష కుటమి ఎంపీలు

Opposition in Manipur: మణిపూర్‌లో గవర్నర్‌ను కలిసిన ప్రతిపక్ష కుటమి ఎంపీలు

వ్రాసిన వారు Stalin
Jul 30, 2023
02:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతిపక్ష కూటమి 'ఇండియా-INDIA'కి చెందిన 21 మంది ఎంపీల బృందం రెండు రోజుల పర్యటన కోసం శనివారం మణిపూర్‌కు వెళ్లింది. రెండో రోజు పర్యటనలో భాగంగా ఆదివారం రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌ అనుసూయ ఉకేని కలిశారు. ఈ సందర్భంగా ఎంపీలు సంతకాలు చేసిన లేఖను గవర్నర్‌కు అందజేశారు. మణిపూర్‌లో హింసాత్మక ఘటనలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరాలని ప్రతిపక్ష ఎంపీలు కోరారు. మణిపూర్ అంశంపై ప్రధాని మౌనం వహించడాన్ని బట్టి చూస్తే, ఆయన రాష్ట్రంలోని హింసపై సీరియస్‌గా లేరని ప్రతిపక్ష ఎంపీలు గవర్న్‌కు తెలియజేశారు. మణిపూర్ రాష్ట్రంలో హింసను అరికట్టడానికి రాష్ట్రంలో 3 ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతాలను సృష్టించాలని కుకీ నాయకుడు, బీజేపీ ఎమ్మెల్యే పోలిన్‌లాల్ హౌకిప్ సూచించారు.

మణిపూర్

శాంతిని నెలకోల్పాలని గరర్నర్‌కు విజ్ఞప్తి

శాంతి, సామరస్యాన్ని తీసుకురావడానికి, బాధిత వ్యక్తులకు పునరావాసం కల్పించడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతిపక్షాలు ఎంపీలు గవర్నర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. గత 89 రోజులుగా మణిపూర్‌లో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయవలసిందిగా గవర్నర్‌ను కోరారు. మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించేందుకు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 140మందికి పైగా మరణాలు, 500 మందికి పైగా గాయాలు, 5,000 కంటే ఎక్కువ గృహాల ధ్వంసమయ్యాయని, ఈ ఘటనలను చూస్తే, ఆస్తులను రక్షించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. ఇదిలా ఉంటే, ప్రతిపక్ష ప్రతినిధి బృందం చురచంద్‌పూర్, మోయిరాంగ్, ఇంఫాల్‌లోని సహాయ శిబిరాలను సందర్శించింది. సహాయక శిబిరాల్లోని బాధితులతో మాట్లాడారు.