Page Loader
Kerala Governor: ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేయకపోవడంపై.. రోడ్డుపై కేరళ గవర్నర్ నిరసన 
Kerala Governor: ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేయకపోవడంపై.. రోడ్డుపై కేరళ గవర్నర్ నిరసన

Kerala Governor: ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేయకపోవడంపై.. రోడ్డుపై కేరళ గవర్నర్ నిరసన 

వ్రాసిన వారు Stalin
Jan 27, 2024
03:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేరళ రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని ఘటన కొల్లంలో చోటుచేసుకుంది. కేరళలో రెండ్రోజులుగా సాగుతున్న గవర్నర్ వర్సెస్ ఎస్‌ఎఫ్‌ఐ వార్ హద్దులు దాటి తారాస్థాయికి చేరుకుంది. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తన కాన్వాయ్‌తో వెళ్తున్న క్రమంలో రాష్ట్రంలోని అధికార సీపీఎం అనుబంధ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు అడ్డుకున్నారు. గవర్నర్‌కు కారు ఎదుట నల్లజెండాతో నిరసన తెలిపారు. దీంతో ఆగ్రహించిన గవర్నర్‌ కారు దిగి, ఆందోళనకారుల వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు గవర్నర్‌‌తో మాట్లాడేందుకు వెళ్లారు. తాను రాకముందే నిరసనకారులను ఎందుకు తొలగించలేదని పోలీసులను గవర్నర్ ప్రశ్నించారు. నిరసనకారులకు పోలీసులు రక్షణ కల్పిస్తున్నారని మండిపడ్డారు.

కేరళ

రోడ్డుపై కుర్చి వేసుకొని కూర్చొని

గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్.. పక్కన ఉన్న షాపులోని ఒక కుర్చి తీసుకొని.. రోడ్డుపైనే వేసుకుని కూర్చొని నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు ఆయన్ను కారు ఎక్కాలని అడ్డగ్గా.. ప్రధానిని పిలవండి, అమిషా‌ను పిలవండి అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వెళ్లే మార్గాల్లో భద్రత ఇలాగే ఉంటుందా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్న వారిని వదిస్తారా అని అడిగారు. అయితే గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ రోడ్డుపై భైఠాయించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చివరికి నిరసనకారులపై నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేయడంతో గవర్నర్ శాంతించారు.

కేరళ

కేంద్రం జోక్యం.. గవర్నర్‌కు Z ప్లస్ CRPF కమాండోల భద్రత

గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపిన ఘటనపై కైంద్రం స్పందించింది. గవర్నర్‌‌కు సీఆర్ పీఎఫ్ కమాండోల జెడ్‌ ప్లస్‌ భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ రాజ్‌భవన్‌కు తెలియజేసింది. ప్రస్తుతం కేరళ పోలీసులు గవర్నర్‌కు భద్రత కల్పిస్తున్నారు. ఇకనుంచి జెడ్ ప్లస్ భద్రతతో 55 మంది భద్రతా దళం గవర్నర్ భద్రతను చూసుకోనుంది. ఐదు కంటే ఎక్కువ బుల్లా ప్రూఫ్ వాహనాల కాన్వాయ్ కూడా గవర్నర్‌కు ఎస్కార్ట్‌గా ఉండనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కేరళ రాజ్ భవన్ ట్వీట్

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కారు దిగి నిరసనకారుల వైపు వెళ్తున్న గవర్నర్