Page Loader
Punjab Governor: పంజాబ్ గవర్నర్ బన్వారీ లాల్ పురోహిత్ రాజీనామా 
Punjab Governor: పంజాబ్ గవర్నర్ బన్వారీ లాల్ పురోహిత్ రాజీనామా

Punjab Governor: పంజాబ్ గవర్నర్ బన్వారీ లాల్ పురోహిత్ రాజీనామా 

వ్రాసిన వారు Stalin
Feb 03, 2024
03:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామాను రాష్ట్రపతికి పంపారు. వ్యక్తిగత కారణాల వల్ల పంజాబ్ గవర్నర్, చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంత అడ్మినిస్ట్రేటర్ పదవికి రాజీనామా చేసినట్లు బన్వరీలాల్ పురోహిత్ పేర్కొన్నారు. ఆగస్టు 2021లో పంజాబ్ 36వ గవర్నర్‌గా బన్వరీలాల్ పురోహిత్ ప్రమాణ స్వీకారం చేశారు. నాడు పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవిశంకర్ ఝా పంజాబ్ రాజ్ భవన్‌లో బన్వరీలాల్ పురోహిత్‌తో ప్రమాణం చేయించారు. 1984, 1989, 1996లో బన్వారీ లాల్ పురోహిత్ లోక్‌సభ ఎంపీ ఎన్నికయ్యారు. మధ్య భారతదేశంలోని పురాతన ఆంగ్ల దినపత్రిక 'ది హితవాడ'కు మేనేజింగ్ ఎడిటర్‌గా కూడా పని చేసారు.

పంజాబ్

1978లో తొలిసారి ఎమ్మెల్యేగా

వివాదరహితుడిగా, ప్రముఖ విద్యావేత్తగా, ప్రసిద్ధ సామాజిక కార్యకర్తగా, జాతీయవాద ఆలోచనాపరుడిగా నాలుగు దశాబ్దాలుగా బన్వారీ లాల్ పురోహిత్ ప్రజాజీవితంలో ఉన్నారు. 1940 ఏప్రిల్ 16న జన్మించిన పురోహిత్ తన పాఠశాల విద్యను నాగ్‌పూర్, రాజస్థాన్‌లోని బిషప్ కాటన్ స్కూల్‌లో చదివారు. నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం నుంచి కామర్స్ డిగ్రీని పొందారు. ఆ తర్వాత క్రియాశీల రాజకీయాలపై ఆసక్తితో మహారాష్ట్రలోని వెనుకబడిన ప్రాంతమైన విదర్భపై కొనసాగుతున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పోరాడటానికి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. 1978లో నాగపూర్ తూర్పు నియోజకవర్గం నుంచి, 1980లో నాగపూర్ సౌత్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. 1982లో మహారాష్ట్ర ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి, మురికివాడల అభివృద్ధి, గృహనిర్మాణ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.