Page Loader
ఏపీ గవర్నర్‌ కోటాలో నూతన ఎమ్మెల్సీలు.. పద్మశ్రీ, రవిబాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ
పద్మశ్రీ, రవిబాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ

ఏపీ గవర్నర్‌ కోటాలో నూతన ఎమ్మెల్సీలు.. పద్మశ్రీ, రవిబాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 11, 2023
10:36 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా కర్రి పద్మశ్రీ, కుంభా రవిబాబులు నియామకమయ్యారు. ఈమేరకు గురువారం ఎన్నికల ప్రధాన అధికారి, ప్ర‌భుత్వ ఎక్స్ అఫిషియో ముఖ్యకార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా పనిచేసిన చాదిపిరాళ్ల శివనాథరెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్‌ పదవీ కాల పరిమితి జులై 20తో ముగిసింది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ సూచన మేరకు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ పద్మశ్రీ, రవిబాబులను మండలి సభ్యులుగా నియమించారు. ఎమ్మెల్సీగా అవకాశమివ్వడంపై హరిబాబు హర్షం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జ‌గ‌న్‌ తనపై ఉంచిన న‌మ్మ‌కాన్ని నిల‌బెడతానన్నారు. గిరిజ‌న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లగా,వాటిని ప‌రిష్కారించిన సీఎంకు రుణ‌ప‌డి ఉంటానని ప్రస్తుతం ఎస్టీ కమిషన్ ఛైర్మన్ రవిబాబు అన్నారు.

details

మా సామాజికవ‌ర్గంలో తొలి మహిళా ఎమ్మెల్సీని నేనే : ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ

ఏపీ శాసనమండలిలో గవర్నర్ కోటాలో ఎంపికైన మరో అభ్యర్థి క‌ర్రి ప‌ద్మ‌శ్రీ సంతోషం వ్యక్తం చేశారు. భారతదేశంలోనే సామాజిక న్యాయం చేస్తున్న ఏకైక ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అని ఆమె కొనియాడారు. మత్స్యకార సామాజికవ‌ర్గం నుంచి ఈ ప‌ద‌వి చేపడుతున్న తొలి మ‌హిళను తానేనని పద్మశ్రీ వెల్లడించారు. తనకు ఇంతటి అవ‌కాశం క‌ల్పించిన సీఎం జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నానని తెలిపారు. కాకినాడ‌లోని వాడ‌ బ‌లిజ (గంగపుత్ర) సామాజిక‌వ‌ర్గానికి చెందిన పద్మశ్రీ గతంలో జాతీయ మ‌త్స్య‌కార సంక్షేమ సమితి ఏపీ మ‌హిళా అధ్య‌క్షురాలిగా ప‌ని చేశారు. ఆమె భ‌ర్త నారాయ‌ణ‌రావు వైసీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా ప‌ని చేశారు.