యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ: వార్తలు

బ్యాంకులో తుపాకీతో రెచ్చిపోయిన ఉద్యోగి; ఐదుగురు దుర్మరణం 

అమెరికా కెంటుకీలోని డౌన్‌టౌన్ లూయిస్‌విల్లేలోని ఓ బ్యాంకు ఉద్యోగి తుపాకీతో రెచ్చిపోయాడు. బ్యాంకులో జరిగిన ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో తొమ్మిది మంది గాయపడినట్లు వెల్లడించారు.

టాల్క్ క్యాన్సర్ క్లెయిమ్‌ల కోసం $8.9 బిల్లియన్స్ ప్రతిపాదించిన జాన్సన్ & జాన్సన్

US ఫార్మాస్యూటికల్ దిగ్గజం జాన్సన్ & జాన్సన్ (J&J) తన టాల్కమ్ పౌడర్ ఉత్పత్తులు క్యాన్సర్‌కు కారణమవుతాయని పేర్కొంటూ ఏళ్ల తరబడి ఉన్న పిటిషన్స్ పరిష్కరించడానికి $8.9 బిలియన్ల పరిష్కారాన్ని ప్రతిపాదించింది.

నేడు కోర్టుకు హాజరుకానున్న ట్రంప్; న్యూయార్క్‌లో హైటెన్షన్

'హష్ మనీ' కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం న్యూయార్క్ లోని మాన్‌హట్టన్ కోర్టులో విచారణకు హాజరుకానున్నారు.

అవుట్‌పుట్ తగ్గింపుతో పెరిగిన చమురు ధరలు

సౌదీ అరేబియాతో పాటు ఇతర OPEC + చమురు ఉత్పత్తిదారులు అవుట్‌పుట్ కోతలను ప్రకటించిన తర్వాత సోమవారం చమురు ధరలు పెరిగాయి.

US కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్న మెక్‌డొనాల్డ్స్

ప్రపంచంలోనే అతిపెద్ద ఫాస్ట్‌ఫుడ్ చైన్‌లలో ఒకటైన మెక్‌డొనాల్డ్స్, ఈ వారంలో అమెరికాలోని అన్ని కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తోంది, ఎందుకంటే తాజా రౌండ్ తొలగింపుల గురించి తన కార్పొరేట్ ఉద్యోగులకు తెలియజేయడానికి సిద్ధమవుతున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.

ట్విట్టర్ లో బరాక్ ఒబామాను దాటేసిన ఎలోన్ మస్క్

ట్విట్టర్ ఫాలోవర్స్ విషయంలో మాజీ అమెరికా అద్యక్షుడు ఒబామాను దాటేసిన ట్విట్టర్ సిఈఓ ఎలోన్ మస్క్.

బి ఎం డబ్ల్యూ i5 ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ వివరాలు

జర్మన్ వాహన తయారీ సంస్థ బి ఎం డబ్ల్యూ 5 సిరీస్ సెడాన్ జీరో-ఎమిషన్ డెరివేటివ్‌పై పని చేస్తోంది, దీనిని i5 అంటారు. బి ఎం డబ్ల్యూ ఎక్కువగా దాని సిరీస్ లో ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందిస్తుంది ఈ 5 సిరీస్ అందులో భాగమే.

23 Mar 2023

ప్రకటన

వరుసగా 9వ సారి వడ్డీ రేట్లను పెంచిన అమెరికన్ సెంట్రల్ బ్యాంక్

కొనసాగుతున్న బ్యాంకింగ్ సంక్షోభంతో US ఫెడరల్ రిజర్వ్‌ను ప్రభావితం చేయడంలో విఫలమైంది. అధిక ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఫెడరల్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇది వరుసగా తొమ్మిదవ సారి పెరగడానికి కారణం ఉద్యోగాల పెరుగుదల, వేతనాల పెంపుదల, వినియోగదారుల వ్యయం, ద్రవ్యోల్బణం.

20 Mar 2023

బ్యాంక్

క్రెడిట్ సూయిస్‌ను కొనుగోలు చేయనున్న UBS బ్యాంక్

స్విట్జర్లాండ్ కు చెందిన అతిపెద్ద బ్యాంక్ UBS, ఆర్ధిక సంక్షోభంలో ఉన్న క్రెడిట్ సూయిస్‌ని కొనుగోలు చేయడానికి అంగీకరించింది.

ఆగమ్యగోచరంగా టిక్ టాక్ యాప్ భవిష్యత్తు

ప్రపంచంలో అత్యంత జనాదరణ టిక్‌టాక్ పొందిన యాప్ ప్రస్తుతం రాజకీయ ఒత్తిడిలో ఉంది. అమెరికాలో జో బిడెన్ ప్రభుత్వం యాప్‌ను దేశవ్యాప్త నిషేధంతో బెదిరించింది, యాప్ చైనీస్ మూలాలు ఆ సంస్థ భవిష్యత్తును ప్రమాదంలో పడేసింది. టిక్ టాక్ లో బిలియన్‌కు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. వీరిలో దాదాపు 140 మిలియన్లు యునైటెడ్ స్టేట్స్ కు చెందినవారే.

17 Mar 2023

బ్యాంక్

భారతీయ స్టార్టప్‌లు SVBలో $1 బిలియన్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి

భారతీయ స్టార్టప్‌లు సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌లో సుమారు $1 బిలియన్ల విలువైన డిపాజిట్లను ఉన్నాయి. దేశ డిప్యూటీ ఐటి మంత్రి మాట్లాడుతూ స్థానిక బ్యాంకులు వారికి మరింత రుణాలు ఇవ్వాలని సూచించినట్లు చెప్పారు. కాలిఫోర్నియా బ్యాంకింగ్ రెగ్యులేటర్లు మార్చి 10న సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB)ని మూసేశారు.

16 Mar 2023

బ్యాంక్

రేటింగ్స్ తగ్గిన తర్వాత అమ్మకాల గురించి ఆలోచిస్తున్న ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్

సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ పతనం తర్వాత కొనసాగుతున్న బ్యాంకింగ్ సంక్షోభ ప్రమాదంలో ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ కూడా చేరింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో దాని షేర్లు 70 శాతానికి పైగా పడిపోయిన తర్వాత ఈ అభివృద్ధి జరిగింది. ఓవర్‌నైట్ ట్రేడింగ్‌లో ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ షేర్లు 21 శాతానికి పైగా పడిపోయాయి.

ప్రపంచవ్యాప్తంగా GPT-4 ఉపయోగిస్తున్న సంస్థలు

OpenAI తన కొత్త పెద్ద భాషా మోడల్ (LLM), GPT-4ను పరిచయం చేసింది. BAR, LSAT, GRE వంటి పరీక్షలలో GPT-4 రాణించింది. OpenAI అందించిన డేటా ప్రకారం, LLM యూనిఫాం బార్ పరీక్షలో 298/400 (అంచనా 90వ పర్సంటైల్), LSATలో 88వ పర్సంటైల్, GRE వెర్బల్‌లో 99వ పర్సంటైల్ స్కోర్ చేసింది. ఇది GPT-3.5 పనితీరు కంటే ముందుంది.

2023లో భారతదేశంలో 10 లక్షల పైగా వలసేతర వీసాలను ప్రాసెస్ చేయనున్న అమెరికా

ఈ ఏడాది భారతదేశంలో 10 లక్షలకు పైగా వలసేతర వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. 2017, 2018 ఆర్థిక సంవత్సరాల్లో భారతీయులకే 10 లక్షలకు పైగా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలు జారీ చేసినట్లు యుఎస్ ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

మెరుగైన స్టైలింగ్ తో మార్కెట్లోకి వచ్చిన 2024 మెర్సిడెస్-బెంజ్ GLC కూపే

జర్మన్ వాహన తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ తన GLC కూపే 2024 వెర్షన్‌ను ప్రపంచ మార్కెట్లలో ప్రకటించింది. ఇది భారతదేశానికి త్వరలోనే వస్తుంది. ప్రీమియం వాహనం డిజైన్‌తో టెక్-ఆధారిత సౌకర్యాలతో ఉన్న సంపన్నమైన క్యాబిన్‌, గరిష్టంగా 255hp శక్తిని ఉత్పత్తి చేసే తేలికపాటి-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ తో నడుస్తుంది.

బి ఎం డబ్ల్యూ R18 బైక్ లో ఉన్న టాప్ 5 ఫీచర్లు గురించి తెలుసుకుందాం

బి ఎం డబ్ల్యూ మోటోరాడ్ తన R 18 B మోటార్‌బైక్ అప్డేట్ వెర్షన్ ను USలోని డేటోనా బైక్ వీక్‌లో ప్రదర్శించింది. ద్విచక్ర వాహనం పేరు R 18 B హెవీ డ్యూటీ, దీనిని ప్రసిద్ధ కస్టమైజర్ ఫ్రెడ్ కోడ్లిన్, అతని కుమారుడు కలిపి రూపొందించారు.

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనానికి ఉద్యోగి కారణం

సిలికాన్ వ్యాలీ బ్యాంక్(SVB) నాయకత్వం $2.25 బిలియన్ల మూలధనాన్ని, $21 బిలియన్ల ఆస్తుల అమ్మకాన్ని ప్రకటించిన తర్వాత, ఒక్కరోజే టెక్ స్టార్టప్‌లలో $42 బిలియన్ల డిపాజిట్లను ఉపసంహరించుకునేలా చేసింది.

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ డిపాజిటర్లకు ఈరోజు నుండి డబ్బు యాక్సెస్ చేసుకునే సదుపాయం

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం US బ్యాంకింగ్ వ్యవస్థను కుదిపేసింది. ఇప్పుడు, దాని డిపాజిటర్లు భయపడకుండా ఉండటానికి, ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (FDIC), US ట్రెజరీ, ఫెడరల్ రిజర్వ్ కలిసి ప్రకటనను విడుదల చేశాయి. ఈరోజు నుండి డిపాజిటర్లు తమ నిధులను యాక్సెస్ చేయచ్చని, SVB రిజల్యూషన్‌ నష్టాలను పన్ను చెల్లింపుదారులు భరించరని ఏజెన్సీలు తెలిపాయి.

11 Mar 2023

బ్యాంక్

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనంతో అస్తవ్యస్తంగా మారిన స్టార్టప్ వ్యవస్థ

శాంటా క్లారా, కాలిఫోర్నియాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB) మూలధనాన్ని సమీకరించడంలో విఫలమై కుప్పకూలింది. దాని ఆస్తులను US ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (FDIC) స్వాధీనం చేసుకుంది. టెక్ లెండర్ షేర్లు గురువారం 60% పడిపోయాయి.

10 Mar 2023

బ్యాంక్

సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం మనకు ఏం చెప్తుంది

టెక్నాలజీ స్టార్టప్‌లకు కీలక రుణదాత, కాలిఫోర్నియాకు చెందిన బ్యాంక్ స్టాక్, శాంటా క్లారా గురువారం మార్కెట్‌లో దారుణంగా చతికిలపడింది.

09 Mar 2023

ప్రయోగం

అంతరిక్షంలోకి దూసుకెళ్లనున్న ప్రపంచంలోనే తొలి 3డీ ప్రింటెడ్ రాకెట్

కాలిఫోర్నియాకు చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ అయిన రిలేటివిటీ స్పేస్ నిర్మించిన ప్రపంచంలోనే మొట్టమొదటి 3డి-ప్రింటెడ్ రాకెట్ త్వరలో అంతరిక్షంలోకి వెళ్లనుంది.

అధికారికంగా విడుదలైన 2024 హ్యుందాయ్ కోనా SUV

దక్షిణ కొరియా తయారీసంస్థ హ్యుందాయ్ తన కోనా SUV 2024 వెర్షన్‌ను వెల్లడించింది. ఇది పెట్రోల్, ఎలక్ట్రిక్ వాహన విభాగాల్లో అందుబాటులో ఉంది. ఈ సంవత్సరం చివరి నాటికి మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది.

ఏడాదిలో రెండోసారి తగ్గింపు ధరతో అందుబాటులో ఉన్న టెస్లా మోడల్ S, X

ఎలోన్ మస్క్ సంస్థ ఎలక్ట్రిక్ వాహన తయారీసంస్థ టెస్లా USలో మోడల్ S, X కార్ల ధరలను తగ్గించింది. ఈ ఏడాది జనవరి తర్వాత దేశంలో వాహనాల ధరలు తగ్గించడం ఇది రెండోసారి. ఇప్పుడు, మోడల్ S $89,990 (సుమారు రూ. 73.6 లక్షలు) నుండి ప్రారంభమవుతుంది, అయితే మోడల్ X ప్రారంభ ధర $99,990 (దాదాపు రూ. 81.8 లక్షలు).

అదానీ బ్లాక్ డీల్‌లో రూ.15,000 కోట్లు పెట్టుబడి పెట్టిన స్టార్ ఇన్వెస్టర్ రాజీవ్ జైన్

అమెరికాకు చెందిన గ్లోబల్ ఈక్విటీ-ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ, GQG పార్టనర్స్‌కు బ్లాక్ డీల్‌లో దాని ప్రమోటర్లు రూ. 15,446 కోట్ల విలువైన వాటాలను అమ్మిన తర్వాత అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల షేర్లు శుక్రవారం పెరిగాయి. ఈ సందర్భంగా పెట్టుబడిదారు, GQG పార్టనర్స్, దాని ఛైర్మన్ రాజీవ్ జైన్ గురించి మార్కెట్లో చర్చ మొదలైంది.

బీస్ట్ రూపంలో దర్శనమివ్వనున్నహోండా CR-V హైబ్రిడ్ రేసర్

జపనీస్ సంస్థ హోండా CR-V హైబ్రిడ్ రేసర్‌ను లాంచ్ చేసింది. ఈ రేస్ కారు 2024లో జరగబోయే NTT INDYCAR సిరీస్‌లో తయారీ సంస్థ ఉపయోగించబోయే టెక్నాలజీకి సంబంధించిన ప్రివ్యూ. 1993 నుండి వివిధ ఉత్తర అమెరికా మోటార్‌స్పోర్ట్ ఈవెంట్‌లలో హోండా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.

FTX వివాదంలో చిక్కుకున్న భారతీయ సంతతికి చెందిన టెక్కీ నిషాద్ సింగ్

FTXలో ఇంజనీరింగ్ మాజీ డైరెక్టర్ నిషాద్ సింగ్ ఆరు మోసం ఆరోపణలకు నేరాన్ని అంగీకరించాడు. క్రిప్టో ఎక్స్ఛేంజ్ పతనంపై దర్యాప్తు చేయడానికి ప్రభుత్వానికి సహాయం చేయడానికి కూడా అతను అంగీకరించాడు.

2022 లో క్రిప్టో, మాల్వేర్ దాడులు వంటి సైబర్ నేరాల పెరుగుదల

గత కొన్ని సంవత్సరాలుగా సైబర్ నేరాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనను పెంచుతున్నాయి, 2022 గణాంకాలు మరీ ఆందోళన కలిగిస్తున్నాయి. సైబర్‌ సెక్యూరిటీ సంస్థ సోనిక్‌వాల్ నివేదికలో 87% ప్రమాదకరమైన డిజిటల్ కార్యకలాపాలు పెరిగాయి. బెదిరింపులు కూడా 150% పెరిగాయి.

27 Feb 2023

కోవిడ్

The Wall Street Journal: చైనా ల్యాబ్‌ నుంచే కరోనా వ్యాప్తి; అమెరికా ఎనర్జీ డిపార్ట్‌మెంట్ నివేదిక

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తి చైనాలో జరిగిందని మరో పరిశోధన తేల్చి చెప్పింది. చైనా ల్యాబ్ నుంచే కరోనా వ్యాప్తి జరిగిందని అమెరికాకు చెందిన ఎనర్జీ డిపార్ట్‌మెంట్ తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు రిపోర్డును 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' ప్రచురించింది.

2023 బి ఎం డబ్ల్యూ XM లేబుల్ రెడ్ బుకింగ్స్ ప్రారంభం

జర్మన్ లగ్జరీ మార్క్ బి ఎం డబ్ల్యూ గ్లోబల్ మార్కెట్లలో 2023 XM లేబుల్ రెడ్ కోసం బుకింగ్స్ ప్రారంభించింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ హైబ్రిడ్ SUV 2,000 యూనిట్ల కంటే తక్కువ ఉత్పత్తితో 2023 చివరినాటికి మార్కెట్లో వస్తుంది.

27 Feb 2023

నాసా

నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపనున్న స్పేస్‌ఎక్స్

ఎలోన్ మస్క్ సంస్థ స్పేస్‌ఎక్స్ సోమవారం నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపనుంది.

2024 బి ఎం డబ్ల్యూ X5 v/s 2024 మెర్సిడెజ్-బెంజ్ GLE ఏది కొనడం మంచిది

వివిధ ప్రపంచ మార్కెట్ల కోసం ఈ నెలలో X5 SUV 2024 వెర్షన్ ను బి ఎం డబ్ల్యూ ప్రకటించింది. ఇది ఆగస్టు నాటికి భారతదేశంలోకి వస్తుందని తెలిపింది. అయితే మార్కెట్లో ఇది 2024 మెర్సిడెజ్-బెంజ్ GLEకి పోటీగా ఉంటుంది.

24 Feb 2023

బ్యాంక్

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగాను నామినేట్ చేసిన అమెరికా

ప్రపంచబ్యాంక్‌లో భారతీయ-అమెరికన్‌ నాయకత్వం వహించే సూచనలు కనిపిస్తున్నాయి. మాజీ మాస్టర్ కార్డ్ సీఈఓ వ్యాపారవేత్త అజయ్ బంగాను ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా US నామినేట్ చేసింది. బ్యాంక్ ప్రస్తుత చీఫ్ డేవిడ్ మాల్పాస్ ఈ నెల ప్రారంభంలో పదవీవిరమణ నిర్ణయాన్ని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ గురువారం బంగా నామినేషన్‌ను ప్రకటించారు.

Spotify కొత్త AI DJ సంగీతాన్ని సృష్టించగలదు, కామెంటరీ అందించగలదు

Spotify అత్యుత్తమ ఆడియో నాణ్యతతో సంగీతాన్ని అందించకపోవచ్చు, కానీ సరైన సమయంలో సరైన సంగీతాన్ని అందించడంలో ముందుంటుంది. ఈ ఆడియో స్ట్రీమింగ్ వేదిక ఇప్పుడు తన కొత్త AIతో పనిచేసే DJతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ChatGPT విజయవంతమైన తర్వాత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కు జనాదరణ విపరీతంగా పెరుగుతుండటంతో, టెక్ కంపెనీలు AI-ఆధారిత ప్రోడక్ట్ తో వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. OpenAI జూక్‌బాక్స్ నుండి రాయల్టీ రహిత సంగీతాన్ని సృష్టించగల Beatovan.ai వరకు ఇటువంటి ఉత్పత్తులు కొత్తేమి కాదు. ఇప్పుడు, Spotify కూడా ఆ లిస్ట్ లో చేరింది.

రెగ్యులర్ కవర్లను మరచిపోండి, భవిష్యత్తులో మీ కారుకు ఇటువంటి రక్షణ అవసరం

యుఎస్ఎకు చెందిన ఆటోమోటివ్ యాక్సెసరీ తయారీదారు కార్క్యాప్సూల్ గాలితో ఉన్న కార్ బబుల్ స్టోరేజ్ సిస్టమ్‌తో కారు కవర్‌ను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మార్చింది. కవర్ వేర్వేరు ఆకారాలు, సైజులలో లభిస్తుంది. అన్ని రకాల కార్లు, బైక్‌లు,వ్యాన్లను స్టోర్ చేయడానికి ఉపయోగించవచ్చు.

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో భారత సంతతి వక్తి వివేక్ రామస్వామి

భారతీయ సంతతికి చెందిన మల్టీ-మిలియనీర్ బయోటెక్ వ్యవస్థాపకుడు వివేక్ రామస్వామి (37) 2024 ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తానని అధికారికంగా ప్రకటించారు.

2000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైన దిగ్గజ కంపెనీ 'మెకిన్సీ'

మరో అంతర్జాతీయ సంస్థ తమ ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమైంది. దిగ్గజ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే & కో తన కంపెనీలోని దాదాపు 2,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ తొలగింపు జాబితాలో క్లయింట్లతో ప్రత్యేక్షంగా సంబంధం లేని వారు మాత్రమే ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

300మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో ఆయిల్ లీక్; అత్యవసర ల్యాండింగ్

అమెరికాలోని నెవార్క్ విమానాశ్రయం నుంచి దిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా AI106 విమానంలో బుధవారం సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అలర్ట్ అయిన పైలెట్, స్వీడన్‌లోని స్టాక్‌హోమ్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.

22 Feb 2023

వీసాలు

వీసాల జారీలో భారత్ మా మొదటి ప్రాధాన్యత: అమెరికా

భారతీయులకు వీసాలు జారీ అంశంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. వీసాల జారీ విషయంలో భారత్‌కే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పింది. కరోనా తర్వాత దేశవ్యాప్తంగా వీసా ప్రాసెసింగ్‌ సుమారు 36 శాతం పెరిగినట్లు పేర్కొంది.

Climate Risk: డేంజర్ జోన్‌లో ముంబయి; దేశంలోని 9రాష్ట్రాల్లో ప్రమాదకరంగా వాతావరణం

2050నాటికి ప్రపంచంలోని 50రాష్ట్రాల్లో వాతావరణం ప్రమాదకరంగా మారనుందని ప్రముఖ వాతావరణ పరిశోధన సంస్థ క్రాస్ డిపెండెన్సీ ఇనిషియేటివ్ (ఎక్స్‌డీఐ) పేర్కొంది. 'గ్రాస్ డొమెస్టిక్ క్లైమెట్ రిస్క్' పేరుతో ఈ మేరకు నివేదికను విడుదల చేసింది.

సరికొత్త రూపంతో 5Gతో లాంచ్ కానున్న 2024 కాడిలాక్ XT4

జనరల్ మోటార్స్ లగ్జరీ డివిజన్ కాడిలాక్ తన XT4 సబ్ కాంపాక్ట్ క్రాసోవర్‌ను వెల్లడించింది. ఇది ఈ ఏడాది వేసవిలో USలోని డీలర్‌షిప్‌లకు వెళుతుంది. ఇది 2.0-లీటర్, టర్బోచార్జ్డ్, నాలుగు-సిలిండర్ ఇంజిన్ తో నడుస్తుంది. కాడిలాక్ XT4 2024 వెర్షన్ ముందూ మోడల్ తో పోల్చితే విభిన్నమైన లుక్ తో మరిన్ని ఫీచర్లతో వస్తుంది.

21 Feb 2023

రష్యా

'బైడెన్ భద్రతకు మేము హామీ ఇచ్చాం'; ఉక్రెయిన్ రహస్య పర్యటనపై స్పందించిన రష్యా

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ రహస్య పర్యటనపై రష్యా స్పందించింది. బైడెన్ తమ నుంచి భద్రతా పరమైన హామీని అందుకున్న తర్వాతే ఉక్రెయిన్‌కు బయలుదేరినట్లు రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ డిమిత్రి మెద్వెదేవ్ చెప్పారు.

ఉక్రెయిన్‌కు రైలులో వచ్చిన బైడెన్: సినిమాను తలపించిన అమెరికా అధ్యక్షుడి రహస్య పర్యటన

యుద్ధ క్షేత్రం ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరాన్ని సందర్శించి ప్రపంచదేశాలను ఆశ్చర్యపరిచారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. ఆయన ఉక్రెయిన్‌కు ఎప్పుడు వెళ్లారు? ఎలా వెళ్లారు? అనేది ఎవరికీ తెలియదు. అంతా రహస్యంగానే సాగింది. రష్యా కళ్లుగప్పి ఆ రహస్య పర్యటన ఎలా సాగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

20 Feb 2023

చైనా

హవాయి: అమెరికా గగనతలంలో మరో 'స్పై బెలూన్'- చైనా పైనే అనుమానాలు

అమెరికా హవాయిలోని హోనోలులు గగనతలంలో పెద్ద తెల్లటి బెలూన్ కనిపించినట్లు కనిపించింది. ఇటీవల చైనాకు చెందిన పలు స్పై బెలూన్లను అమెరికా బలగాలు పేల్చేసిన కొద్దిరోజుల తర్వాత, ఇది తాజాగా దర్శనమివ్వడం గమనార్హం.

అమెరికా: మిస్సిస్సిప్పిలో తుపాకీ గర్జన; ఆరుగురు మృతి

అమెరికాలో మరోసారి తుపాకుల మోత మోగింది. మిస్సిస్సిప్పిలోని టేట్ కౌంటీలో శుక్రవారం వరుస కాల్పుల నేపథ్యంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులన్ని అర్కబుట్ల కమ్యూనిటీలోనే జరిగినట్లు వెల్లడించారు.

అమెరికా ప్రెసిడెంట్ బిడ్‌ కు సిద్దపడుతున్న భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఒక ప్రత్యేకత సంతరించుకోనున్నాయి. ప్రెసిడెంట్ రేసులో భారత సంతతికి చెందిన కొందరు కూడా పాల్గొనే అవకాశం ఉంది. వారిలో మిలియనీర్ వివేక్ రామస్వామి ఒకరు.

17 Feb 2023

ప్రపంచం

ఎయిర్ న్యూజిలాండ్ ప్లేన్: 16గంటలు గాల్లోనే ప్రయాణం చేసి వెనక్కి వచ్చేసిన ఫ్లైట్

ఎయిర్ న్యూజిలాండ్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన ఫ్లైట్ NZ2, న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ నుండి అమెరికాలోని న్యూయార్క్ ఎయిర్ పోర్ట్ కి బయలు దేరింది.

COVID-19 ఇన్ఫెక్షన్ మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది

JAMA నెట్‌వర్క్ ఓపెన్ జర్నల్‌లో ఒక అధ్యయనం COVID-19 బారిన పడిన వారికి మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని శరీరం గ్లూకోజ్‌ను ప్రాసెస్ చేసే విధానాన్ని ప్రభావితం చేస్తుందని తెలిపింది.

అధ్యక్ష ఎన్నికల వేళ వైట్‌హౌస్ కీలక ప్రకటన- బైడెన్‌కు పూర్తిస్థాయి వైద్య పరీక్షలు

2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో మరోసారి ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ నిలబడబోతున్నారు. ఎన్నికలకు సంబంధించిన ప్రచారాన్ని కూడా ఇప్పటికే అధికార రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు ప్రారంభించారు. ఈ క్రమంలో వైట్ హౌస్ కీలక ప్రకటన విడుదల చేసింది.

టెక్సాస్‌ షాపింగ్ మాల్‌లో కాల్పులు; ఒకరు మృతి

అమెరికా టెక్సాస్‌లోని సీలో విస్టా మాల్‌లో బుధవారం సాయంత్రం దుండగులు తుపాకీతో రెచ్చిపోయాడు. నలుగురిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. మరో ముగ్గురు గాయపడ్డారని పేర్కొన్నారు.

ఇకపై హ్యుందాయ్, కియా కార్లను దొంగిలించడం మరింత కష్టం

USలో వాహన దొంగతనం అనేది ఒక పెద్ద సమస్య, కొన్ని బీమా కంపెనీలు సులభంగా దొంగిలించగల మోడల్‌లకు ఇన్సూరెన్స్ కి నిరాకరిస్తాయి. హ్యుందాయ్, కియా మోటార్స్ దాదాపు 8.3 మిలియన్ వాహనాల కోసం ఉచిత సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను విడుదల చేస్తున్నాయి, అది వాటిని దొంగిలించడం కష్టం చేస్తుంది. హ్యుందాయ్ ఇప్పటికే తన కార్లపై ఫర్మ్‌వేర్‌ను అందించడం ప్రారంభించింది.

ఎయిర్ ఇండియా చారిత్రక ఒప్పందం: 34బిలియన్ డాలర్ల విలువైన 220 బోయింగ్ విమానాలకు ఆర్డర్

'టాటా'లకు చెందిన ఎయిర్ ఇండియా - అమెరికాకు చెందిన బోయింగ్ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. 34 బిలియన డాలర్ల విలువైన 220 బోయింగ్ విమానాలకు ఎయిర్ ఇండియా ఆర్డర్ ఇచ్చింది.

13 Feb 2023

రష్యా

'వెంటనే రష్యాను వీడండి'; తమ పౌరులకు అమెరికా కీలక ఆదేశాలు

రష్యాలో నివసిస్తున్న లేదా ప్రయాణించే అమెరికా పౌరులు వెంటనే ఆ దేశాన్ని వీడాలని మాస్కోలోని యూఎస్ రాయబార కార్యాలయం తెలిపింది. కొత్తగా వెళ్లే వారు కూడా రష్యాకు వెళ్లవద్దని సూచించింది. అక్రమ నిర్బంధాల కారణంగా అమెరికా పౌరులు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది.

13 Feb 2023

కెనడా

కెనడా సరిహద్దులో నాలుగో గుర్తు తెలియని వస్తువును కూల్చేసిన అమెరికా

గత కొన్నిరోజులుగా అమెరికాలో గగనతల ఉల్లంఘనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అమెరికా గగనతలంలో అనుమానాస్పదంగా కనిపించిన గుర్తు తెలియని వస్తువును అమెరికా దళాలు కూల్చివేశాయి.

మునుపటి
తరువాత