Page Loader
ఇకపై  హ్యుందాయ్, కియా కార్లను దొంగిలించడం మరింత కష్టం
ఇకపై హ్యుందాయ్, కియా కార్లను దొంగిలించడం మరింత కష్టం

ఇకపై హ్యుందాయ్, కియా కార్లను దొంగిలించడం మరింత కష్టం

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 15, 2023
06:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

USలో వాహన దొంగతనం అనేది ఒక పెద్ద సమస్య, కొన్ని బీమా కంపెనీలు సులభంగా దొంగిలించగల మోడల్‌లకు ఇన్సూరెన్స్ కి నిరాకరిస్తాయి. హ్యుందాయ్, కియా మోటార్స్ దాదాపు 8.3 మిలియన్ వాహనాల కోసం ఉచిత సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను విడుదల చేస్తున్నాయి, అది వాటిని దొంగిలించడం కష్టం చేస్తుంది. హ్యుందాయ్ ఇప్పటికే తన కార్లపై ఫర్మ్‌వేర్‌ను అందించడం ప్రారంభించింది. USలో హ్యుందాయ్, కియా మోటార్స్ అమ్మే కొన్ని అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో దొంగతనాన్ని నివారించే టెక్నాలజీ లేదు. ఇది వాటిని దొంగిలించడం చాలా సులభం చేస్తుంది అంతేకాకుండా దేశంలో క్రాష్‌లు, మరణాలకు కారణమైంది. ఒక సాధారణ సాఫ్ట్‌వేర్ ప్యాచ్ కారుకు రక్షణకు అందించగలదు. చివరికి రోడ్లను సురక్షితంగా మార్చగలదు.

కార్

ప్రభావిత మోడళ్లలో ఎలక్ట్రానిక్ ఇమ్మొబిలైజర్లు లేవు, ఇవి కారు, కీలోని కంప్యూటర్ చిప్‌లపై ఆధారపడతాయి

ప్రభావిత మోడళ్లలో ఎలక్ట్రానిక్ ఇమ్మొబిలైజర్లు లేవు, ఇవి కారు, కీలోని కంప్యూటర్ చిప్‌లపై ఆధారపడతాయి. కీ ఆ కారుకు సంబంధించిందా చిప్స్ కమ్యూనికేట్ చేస్తాయి కాకపోతే ఆ కారు కదలదు. కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, కీ ఫోబ్‌ని ఉపయోగించి డోర్లు లాక్ చేస్తే కార్లు స్టార్ట్ కావు. ఇంతలో, అలారం సౌండ్ వ్యవధి 30 సెకన్ల నుండి ఒక నిమిషం వరకు పెంచారు. అప్‌డేట్‌ను అందించే డీలర్‌షిప్‌లు కారు విండోలపై డీకాల్‌లను అతికిస్తాయి, ఇది సంబంధిత కారు సాఫ్ట్వేర్ పొందినట్లు దొంగలకు తెలియజేస్తుంది. సాఫ్ట్ వేర్ అప్డేట్ పొందిన హ్యుందాయ్ మోడల్‌ యజమానులకు ఫోన్, మెయిల్, ఇమెయిల్‌ల ద్వారా తెలియజేయబడుతోంది.