Page Loader
మే చివరినాటికి భారతదేశంలో 2023 హ్యుందాయ్ VERNA విడుదల
2023 VERNA సెడాన్ ను రూ.25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు

మే చివరినాటికి భారతదేశంలో 2023 హ్యుందాయ్ VERNA విడుదల

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 14, 2023
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ కొరియా తయారీ సంస్థ హ్యుందాయ్ 2023 VERNA సెడాన్ మే నాటికి భారతదేశంలో విడుదల చేస్తుందని ప్రకటించింది. ఇప్పుడు ఈ సెడాన్ ను రూ.25,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. రాబోయే కారు టీజర్ చిత్రాలను కూడా షేర్ చేసింది హ్యుందాయ్. వీటిని 70,000 యూనిట్లను తయారు చేస్తుందని, దీనికి చాలా డిమాండ్‌ని ఆశిస్తున్నట్లు హ్యుందాయ్ తెలిపింది. ఇది నాలుగు ట్రిమ్‌లలో అందించబడుతుంది: EX, S, SX, SX(O). ఇది భారత్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్‌లోనూ విడుదల అవుతుంది. మార్కెట్లో స్కోడా స్లావియా, వోక్స్‌వ్యాగన్ వర్టస్, మారుతి సుజుకి సియాజ్‌లతో పోటీ పడుతుంది. ఈ కారు 9 రంగులలో అందుబాటులో ఉంది.

కారు

2023 హ్యుందాయ్ VERNA ధర, ఇతర వివరాలు లాంచ్ సమయంలో తెలుస్తాయి

2023 హ్యుందాయ్ VERNA 1.5-లీటర్ Turbo GDi పెట్రోల్ ఇంజన్ తో పాటు 1.5-లీటర్ MPi పెట్రోల్ మిల్లుతో నడుస్తుంది. దీని లోపల ఐదు సీట్లు, USB ఛార్జర్‌లు, కీలెస్ ఎంట్రీ, ఆటో క్లైమేట్ కంట్రోల్, వెనుక AC వెంట్‌ల తో పాటు మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్‌ ఉన్నాయి. ప్రయాణీకుల భద్రత కోసం ADAS, ABS, EBD తో పాటు, ఒకటి కంటే ఎక్కువ ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. భారతదేశంలో 2023 హ్యుందాయ్ VERNA ధర, ఇతర వివరాలు లాంచ్ సమయంలో ప్రకటించబడతాయి. అయితే, దీని ధర రూ. 9.64 లక్షల(ఎక్స్-షోరూమ్)తో ప్రారంభమయ్యే ప్రస్తుత అవుట్‌గోయింగ్ మోడల్ కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది.