Page Loader
ఆగమ్యగోచరంగా టిక్ టాక్ యాప్ భవిష్యత్తు
టిక్‌టాక్ లో 140 మిలియన్ల యునైటెడ్ స్టేట్స్ యాక్టివ్ యూజర్లు

ఆగమ్యగోచరంగా టిక్ టాక్ యాప్ భవిష్యత్తు

వ్రాసిన వారు Nishkala Sathivada
Mar 18, 2023
11:53 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలో అత్యంత జనాదరణ టిక్‌టాక్ పొందిన యాప్ ప్రస్తుతం రాజకీయ ఒత్తిడిలో ఉంది. అమెరికాలో జో బిడెన్ ప్రభుత్వం యాప్‌ను దేశవ్యాప్త నిషేధంతో బెదిరించింది, యాప్ చైనీస్ మూలాలు ఆ సంస్థ భవిష్యత్తును ప్రమాదంలో పడేసింది. టిక్ టాక్ లో బిలియన్‌కు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. వీరిలో దాదాపు 140 మిలియన్లు యునైటెడ్ స్టేట్స్ కు చెందినవారే. చైనీస్ ప్రభుత్వం నుండి డేటా హార్వెస్టింగ్‌కు అవకాశం ఉండటం, యాప్ కు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్రజాదరణ అన్నీ దేశాల ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తుంది. టిక్‌టాక్‌పై అమెరికా ప్రభుత్వం తన చర్యలను వేగవంతం చేసింది. యాప్ ఇప్పుడు పేరెంట్ సంస్థ బైట్‌డాన్స్‌తో విడిపోకపోతే దేశంలో నిషేదం ఎదుర్కోవలసి ఉంటుంది.

టిక్‌టాక్‌

జూన్ 2020లో భారతదేశం టిక్‌టాక్‌ను నిషేదించింది

గత ఏడాది డిసెంబర్‌లో, US హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ తమ సిబ్బంది ఫోన్‌ల నుండి టిక్‌టాక్ తొలగించాలని ఆదేశించింది. ఇప్పుడు, UK, న్యూజిలాండ్ కూడా దీనిని అనుసరించాయి. యూరోపియన్ యూనియన్, కెనడా కూడా అధికారిక ఫోన్ల నుండి యాప్‌ను నిషేధించాయి. జూన్ 2020లో భారతదేశం టిక్‌టాక్‌ను నిషేదించింది. గోప్యత, భద్రతా కారణాలను పేర్కొంటూ భారతదేశం దేశం నుండి యాప్‌ను తొలగించింది. టిక్‌టాక్ తన వినియోగదారుల డేటాకు చైనాకుయాక్సెస్ లేదని పదేపదే పేర్కొంది. అమెరికా ఆందోళనలకు నిషేదం సమాధానం కాదని కంపెనీ అభిప్రాయపడింది. అయితే ఈ గందరగోళం మధ్యలో టిక్‌టాక్‌లో కెరీర్‌ను నిర్మించుకున్న క్రియేటర్లు ఉన్నారు. యాప్‌పై నిషేధం ఖచ్చితంగా వారిని ఆర్థికంగా దెబ్బతీస్తుంది.