2023లో భారతదేశంలో 10 లక్షల పైగా వలసేతర వీసాలను ప్రాసెస్ చేయనున్న అమెరికా
ఈ ఏడాది భారతదేశంలో 10 లక్షలకు పైగా వలసేతర వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయాలని అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. 2017, 2018 ఆర్థిక సంవత్సరాల్లో భారతీయులకే 10 లక్షలకు పైగా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలు జారీ చేసినట్లు యుఎస్ ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. సందర్శకుల వీసాల కోసం ఇంటర్వ్యూ వెయిటింగ్ పీరియడ్‌లను గత నవంబర్‌లో మూడు సంవత్సరాల నుండి రెండు సంవత్సరాలకు తగ్గించడానికి గత కొన్ని నెలల్లో అనేక చర్యలు తీసుకున్నారు అంకుల్ సామ్. భారతదేశంలోని US మిషన్ ఇప్పటికే భారతదేశంలోని రాయబార కార్యాలయం, కాన్సులేట్లలో రెండు లక్షలకు పైగా వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేసింది. 10 లక్షలకు పైగా ప్రాసెస్ చేయాలనే లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నామని AUS ఎంబసీ ప్రతినిధి అన్నారు.
మిషన్ మిలియన్ తో వీసా దరఖాస్తుల ప్రొసెస్ వేగవంతం
(US) డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ 2022లో ప్రపంచవ్యాప్తంగా 90 లక్షల నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేసింది మిషన్ మిలియన్ అనేది రెండు దేశాల మధ్య ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే ప్రయత్నం. విజిటర్ వీసా ఇంటర్వ్యూ కేసుల కోసం రెండు సంవత్సరాల కంటే తక్కువ సమయాన్ని తగ్గించడానికి US అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంది. విజిటర్ వీసా, బి1 (బిజినెస్), బి2 (టూరిస్ట్), ఇంటర్వ్యూల కోసం గత ఏడాది దాదాపు 1,000 రోజుల నిరీక్షణను తాకిన భారతదేశంలో ఈ సమయాన్ని తగ్గించడానికి అమెరికా అనేక చర్యలు తీసుకుంటుంది. సుదీర్ఘ నిరీక్షణ ఉన్నప్పటికీ, 2022లో 14 లక్షలకు పైగా భారతీయులు అమెరికాను సందర్శించారు.