Page Loader
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగాను నామినేట్ చేసిన అమెరికా
మాస్టర్ కార్డ్‌లో 2009లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా చేరారు

ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగాను నామినేట్ చేసిన అమెరికా

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 24, 2023
02:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచబ్యాంక్‌లో భారతీయ-అమెరికన్‌ నాయకత్వం వహించే సూచనలు కనిపిస్తున్నాయి. మాజీ మాస్టర్ కార్డ్ సీఈఓ వ్యాపారవేత్త అజయ్ బంగాను ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా US నామినేట్ చేసింది. బ్యాంక్ ప్రస్తుత చీఫ్ డేవిడ్ మాల్పాస్ ఈ నెల ప్రారంభంలో పదవీవిరమణ నిర్ణయాన్ని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ గురువారం బంగా నామినేషన్‌ను ప్రకటించారు. బంగా ఆ పదవికి ఎంపికైతే, ప్రతిష్టాత్మక సంస్థకు నాయకత్వం వహించే మొదటి భారతీయ మూలాలు ఉన్న వ్యక్తిగా చరిత్ర సృష్టిస్తారు . బంగా పంజాబీ కుటుంబంలో నవంబర్ 10, 1959న పూణేలో జన్మించారు. ప్రారంభ విద్య సిమ్లాలో హైదరాబాద్ లో జరిగింది. ఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో బ్యాచిలర్స్ పూర్తి చేశారు.

బ్యాంక్

దేశంలో పెప్సికో ఫాస్ట్-ఫుడ్ ఫ్రాంచైజీలను ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించిన బంగా

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, అహ్మదాబాద్ (IIM-A) నుండి MBAతో సమానమైన PGP సంపాదించారు. బంగా 1981లో నెస్లే ఇండియాలో 13 సంవత్సరాలపాటు, వివిధ పదవుల్లో పని చేశారు. తర్వాత, పెప్సికోలో రెండేళ్లపాటు పనిచేశారు. ఆ సమయంలో దేశంలో పెప్సికో ఫాస్ట్-ఫుడ్ ఫ్రాంచైజీలను ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించారు. మాస్టర్ కార్డ్‌లో 2009లో కంపెనీ ప్రెసిడెంట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా చేరారు. ఆ తర్వాత సీఈఓ అయ్యారు, ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా డిసెంబర్ 31, 2021 వరకు ఆ సంస్థలో ఉన్నారు. మాస్టర్ కార్డ్‌ను విడిచిపెట్టిన తర్వాత బంగా జనరల్ అట్లాంటిక్ అనే ప్రైవేట్ ఈక్విటీ సంస్థలో చేరారు. ప్రస్తుతం అక్కడ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.