Brahmanandam : తెలుగు ఇండియన్ ఐడల్ షోలో ఏడ్చేసిన బ్రహ్మానందం.. ఎందుకంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
కామెడీ దిగ్గజం బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాల్లో తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించి మాయ చేసేస్తారు. అయితే స్టేజీపై మాట్లాడితే, ఆయన మాటలలోని భావోద్వేగం విన్నవారి గుండెను తాకాల్సిందే. కోట్లాది మంది అభిమానులను తన హాస్యంతో ఆకట్టుకునే బ్రహ్మానందం, సాధారణంగా స్టేజీపై ఏడవడం అరుదు. కానీ ఇటీవల, ఒక ప్రోగ్రామ్‌లో, అందరిని ఆశ్చర్యంలో ముంచేలా ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇది అభిమానులకు షాకింగ్ అనిపించింది. బ్రహ్మానందం ప్రస్తుతం సినిమాలు చాలా తగ్గించేశారు. ఈ క్రమంలోనే "ఆహా"లో స్ట్రీమింగ్ అయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4లో అయన గెస్ట్‌గా హాజరయ్యాడు. తన ప్రత్యేకమైన కామెడీ శైలితో ప్రేక్షకులను గట్టిగా ఆకట్టుకున్నాడు.
వివరాలు
వైరల్ అవుతున్న ప్రోమో
ఇక ఆయన గెస్ట్ గా వచ్చిన సందర్భంగా బ్రహ్మానందం ప్రోమోను రిలీజ్ చేశారు. ప్రోమో చివర్లో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. హోస్ట్ అడిగినప్పుడు, దివంగత గాయకుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యంతో ఉన్న సంబంధం గురించి, బ్రహ్మానందం చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆయన చెప్పింది ఏమిటంటే, ఎస్పీబీ తనకు కుటుంబ సభ్యుడిలా ఉండేవాడు. ఈ భావోద్వేగం కారణంగా, చివర్లో ఆయన కన్నీళ్లు పెట్టారు. ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. సాధారణంగా బ్రహ్మానందం స్టేజీపై కన్నీళ్లు పెట్టడం చాలా అరుదే. తనదైన కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తారు, లేకుంటే స్పీచ్ ద్వారా అందరినీ ఎమోషన్ అయ్యేలా చేస్తారు. కానీ ఈసారి ఆయన ఎమోషనల్ అవడం ప్రేక్షకులకు చాలా కొత్త అనుభూతి.