
PM Modi:రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తి మద్దతు: ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవానికి,సంప్రదాయానికి నిలయమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలోని నన్నూరు ప్రాంతంలో 'సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్' పేరుతో నిర్వహించిన బహిరంగ సభకు సీఎం చంద్రబాబు నాయుడు, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ సహా అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే నిర్మించిన, నిర్మించబోయే రూ.13,429 కోట్ల విలువల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
వివరాలు
గుజరాత్‌లో జ్యోతిర్లింగం సోమనాథుడి స్థలంలో నేను జన్మించాను: మోదీ
"ఆంధ్రప్రదేశ్ సైన్స్,ఆవిష్కరణల కేంద్రంగా ఎదుగుతోంది. రాష్ట్రంలో అనేక అవకాశాలు ఉన్నప్పటికి యువతలో అపారమైన శక్తి ఉంది. అహోబిలం నర్సింహస్వామి, మహానంది ఈశ్వరుడికి నమస్కరిస్తున్నాను. మంత్రాలయం రాఘవేంద్రస్వామి అందరికి ఆశీర్వదించాలని కోరుతున్నాను. గుజరాత్‌లో జ్యోతిర్లింగం సోమనాథుడి స్థలంలో నేను జన్మించాను. కాశీ విశ్వనాథుడి భూమికి సేవ చేసే అవకాశం నాకు లభించింది. ఈ రోజు శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆశీస్సులు పొందాను"అని ప్రధాని మోదీ అన్నారు.
వివరాలు
2047 నాటికి మన దేశం వికసిత్ భారత్‌గా మారుతుంది: మోడీ
ప్రధాని మోదీ చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల రూపంలో రాష్ట్రానికి బలమైన నాయకత్వం ఉందని, ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తున్నదని చెప్పారు. "గత 16 నెలలుగా రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతోంది. డబుల్ ఇంజిన్ సర్కారు కారణంగా ఏపీ అనూహ్య ప్రగతి సాధిస్తోంది. దిల్లీ, అమరావతి అభివృద్ధి పథంలో వేగంగా సాగుతున్నాయి. 2047 నాటికి మన దేశం వికసిత్ భారత్‌గా మారుతుంది. 21వ శతాబ్దం 140 కోట్ల భారతీయుల శతాబ్దం" అని ఆయన తెలిపారు.